Share News

ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం భరోసా

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:49 AM

అర్హులైన ప్రతి ఆక్వా రైతుకు యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50పైసలకే అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు తెలిపారు.

 ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం భరోసా

నేడు పాలకొల్లులో రూ 1.50కే యూనిట్‌ విద్యుత్‌ సబ్సిడీ అమలు జీవో విడుదల

హాజరు కానున్న మంత్రులు అచ్చన్నాయుడు, రవి కుమార్‌

పాలకొల్లు అర్బన్‌, ఆగస్టు 10 (ఆంధ్ర జ్యోతి):అర్హులైన ప్రతి ఆక్వా రైతుకు యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50పైసలకే అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం పాలకొల్లులో ఆక్వా రైతుల సభ జరిగే స్థలం వద్ద సోమవారం రాత్రి మంత్రి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈసభలో ఆక్వా రైతులు ముంఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణలకు కృతజ్ఞతలు తెలియజేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఈసభకు ముఖ్య అతిఽథులుగా రాష్ట్ర మంత్రులు కె.అచ్చన్నాయుడు, గొట్టిపాటి రవి కుమార్‌ హాజరు కానున్నారని తెలిపారు. ఆక్వా రైతులకు రూ.1.50కే విద్యుత్‌ సరఫరా అమలు చేసే జీవోను మంత్రులు మంగళవారం పాలకొల్లులో విడుదల చేయనున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వంలో ఆక్వా రైతులకు సబ్సిడీ అంశంపై పరిమితులు విధించడం జరిగిందన్నారు. దీని వల్ల రైతులు ఏవిధమైన ప్రయోజనం పొందలేక పోయారని తెలిపారు. జగన్‌ పాదయాత్రలో యూనిట్‌ రూ.1.50కే అందిస్తామని ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక నిబంధనల పేరుతో ఆక్వా రైతులను దగా చేశారన్నారు. ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్‌ రాజు మాట్లాడుతూ ఈబహిరంగ సభలో ఆక్వా రైతులు అందరూ పాల్గొని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియ చేయనున్నట్టు తెలిపారు.

Updated Date - Aug 11 , 2026 | 12:49 AM