Share News

పులి మళ్లీ వచ్చింది

ABN , Publish Date - Nov 11 , 2026 | 12:15 AM

మండలంలోని సిద్ధారం సమీపంలో నాలుగు నెలల క్రితం పెద్దపులి సంచారం, ఆవులపై దాడితో ప్రజలు హడలిపోయారు.

పులి మళ్లీ వచ్చింది

కొత్తూరు సమీపంలో మూడు ఆవులపై దాడి

వేలేరుపాడు, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని సిద్ధారం సమీపంలో నాలుగు నెలల క్రితం పెద్దపులి సంచారం, ఆవులపై దాడితో ప్రజలు హడలిపోయారు. వారం రోజులు అక్కడే మకాం వేసి ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేసిన పెద్దపులి పాపి కొండల మీదుగా పోలవరం మండలంలో ప్రవేశించి అధికారులను ముప్పతిప్పలు పెట్టింది. తిరిగి మంగళవారం తెల్లవారుజా మున మండలంలోని కొత్తూరు పక్కనే ఉన్న చెరువు కట్ట వద్ద పశువులపై హఠాత్తుగా పెద్ద పులి దాడి చేసింది. మూడు ఆవులు చనిపోవడంతో గ్రామ ప్రజల్లో భయాందోళ నలు నెలకొన్నాయి. గతంలో రేడియో టెలి ట్రాకర్‌ను పెద్దపులి మెడలో అమర్చారు. పులి సంచారం అధికారులు గమనించే అవకాశం ఉండేది. నాలుగు నెలలుగా పోలవరం, బుట్టా యగూడెం, గోదావరి అవతల ఉన్న దేవీప ట్నం మండలాల్లో సంచరిస్తూ పశువులను వధిస్తూ ఉన్నా దాని కదలికలు గమనిస్తు న్నారే తప్ప పట్టుకోలేకపోయారని ప్రజల ఆరోపణ. గత జూలైలో వేలేరుపాడు మండ లం సిద్ధారం గ్రామ సమీపంలో ఆవులను చంపి కొంత భాగాన్ని తిని పక్కనే అడవిలో విశ్రాంతి తీసుకుంది. అప్పట్లో పూనె నుంచి వచ్చిన ప్రత్యేక రెస్క్యూ బృందాలు, అటవీశాఖ అధికారులు పులిని బంధించ డంలో విఫలమయ్యారని ఆరోపణలు వచ్చా యి. మండలంలో దాదాపు గిరిజన గ్రామా లన్ని అటవీ ప్రాంతానికి అనుకునే ఉన్నాయి. ఈ గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు తెలుస్తున్నప్పటికి అటవీశాఖాధికారులు ప్రజ లను అప్రమత్తం చేయలేదు. మంగళవారం తెల్లవారుజామున కూడా పులిని టెలిట్రాకర్‌ సాయంతో అధికారులు గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయలేదని ఆగ్రహం వ్యక్తమవు తోంది. సాధారణంగా గిరిజన గ్రామాల్లోని ప్రజలు ఎక్కువ శాతం బహిర్భూమికి తెల్లవారుజామునే బయటకు వెళుతుంటారు. ఆ సమయంలో పెద్దపులి దాడి చేస్తే ప్రాణనష్టం జరిగే అవకాశాలున్నాయి.

అదే పులి వచ్చిందా..

వేలేరుపాడు మండలంలోకి ప్రవేశించిన పులి, పోలవరం జిల్లా వీఆర్‌.పురం మండలం లో సంచరించిన పులి ఒక్కటేనా అనే సందే హాలు వ్యక్తమవుతున్నాయి. వీఆర్‌పురం మం డలం పాతసీతం పేట పొలాల్లో సోమవారం పెద్దపులి సంచరించినట్లు అక్కడి అటవీ శాఖాధికారులు పులి పాదముద్రల ద్వారా గుర్తించారు. శ్రీరామగిరి అటవీ ప్రాంతం గుండా ప్రయాణించి సుమారు 2 కిలోమీటర్ల వెడల్పున ఉన్న గోదావరి నదిని దాటుకుని కొత్తూరు సమీపంలోకి చేరుకున్నట్లు అను మానిస్తున్నారు. ఆ పులి ఈ పులి ఒక్కటేనా అనేది అటవీశాఖాధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. పెద్దపులి సంచారంతో వేలేరుపాడు ఎస్సై నవీన్‌కుమార్‌ అటవీ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి ఎవరూ అడవుల్లోకి వెళ్ల వద్దని, పశువులను కూడా అటవీ ప్రాంతానికి దూరంగా కట్టాలని సూచించారు.

Updated Date - Nov 11 , 2026 | 12:15 AM