Share News

పెద్దపులి ఇంటిదారి

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:28 AM

అధికారులు, ప్రజలను ముప్పుపతిప్పలు పెట్టిన పెద్దపులి ఎట్టికేలకు ఇంటిదారి పట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పెద్దపులి  ఇంటిదారి

ఎట్టకేలకు ఇంటి దారి పట్టిన పులి

ఊపిరి పీల్చుకున్న మన్యం ప్రజలు, అటవీ అధికారులు

బుట్టాయగూడెం, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): అధికారులు, ప్రజలను ముప్పుపతిప్పలు పెట్టిన పెద్దపులి ఎట్టికేలకు ఇంటిదారి పట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఐదు రోజులపాటు ఏలూరు జిల్లా పోలవరం, బుట్టాయగూడెం మండలాల్లో మకాం వేసిన పులి తూర్పు పాలకుంట, రేపల్లె, పూసిగొంది ప్రాంతాల్లో ఐదు పశువులను చంపడమే కాకుండా ఒక ఎద్దుపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం పూసిగొంది అటవీ ప్రాంతం నుంచి గుబ్బల మంగమ్మతల్లి అటవీ ప్రాంతం మీదుగా అభయారణ్యం వైపు నడుస్తూ తెలంగాణ రాష్ట్రంలోని కావడిగుండ్ల, కంట్లం వైపుగా వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. చత్తీస్‌ఘడ్‌ అడవుల నుంచి అటువైపుగానే రాష్ట్రంలోకి వచ్చిన పులి అదే దారిలో వెళ్లిపోతుందని అధికారులు తెలిపారు. దీంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Jun 29 , 2026 | 12:28 AM