Share News

పులి అడుగు జాడలు

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:26 AM

ఇప్పటి వరకూ మెట్ట, అటవీ ప్రాంతాల్లోని ప్రజలను ఆందోళనకు గురిచేస్తూ కంటిపై కునుకు లేకుండా చేసే పెద్ద పులి ఇప్పుడు మాగాని భూములపై వచ్చింది.

పులి అడుగు జాడలు
కోనాలలో అధికారుల పరిశీలన

ఆరుళ్ల నుంచి పసలపూడి వైపు..

భద్రత కట్టుదిట్టం.. అధికారులు అప్రమత్తం

డ్రోన్‌లతో పోలీసుల గస్తీ.. పుణె నుంచి నిపుణుల రాక

తాడేపల్లిగూడెం రూరల్‌/తణుకు రూరల్‌, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకూ మెట్ట, అటవీ ప్రాంతాల్లోని ప్రజలను ఆందోళనకు గురిచేస్తూ కంటిపై కునుకు లేకుండా చేసే పెద్ద పులి ఇప్పుడు మాగాని భూములపై వచ్చింది. గడిచిన మూడు రోజులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం, తాళ్లపూడి, దేవరపల్లి, చాగల్లు, నిడదవోలు మండలాల్లో కనిపించిన పెద్ద పులి గురువారం అర్ధరాత్రి తాడేపల్లిగూ డెం మండలం ఆరుళ్ల నుంచి తణుకు మండలం కోనాల గ్రామంలో ప్రవేశించి అక్కడ నుంచి ఎర్ర కాలువ దాటి శుక్రవారం తెల్లవారుజా మున ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామం చేరుకున్నట్లుగా అధికారులు నిర్దారించారు. పసలపూడి పంట పొలాల్లో పెద్ద పులి నిద్రలో వుండటంతో శుక్రవారం రాజమండ్రి, భీమవరం డివిజనల్‌ అట వీ శాఖ అధికారులతో రాష్ట్రస్థాయి అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉన్నారు. పెద్ద పులి కదలికలను డ్రోన్‌ ద్వారా గమనిస్తూ బంధించేందు కు అటవీ, పోలీస్‌ సిబ్బంది గస్తీ ఏర్పాటుచేశారు. పుణె నుంచి ప్రత్యేక నిపుణులను రప్పిస్తున్నట్లు తెలిపారు. రాత్రి ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన విద్యుత్‌, మంచినీరు, వసతి వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. పులుల సంరక్షణ ప్రాంతం నుంచి తప్పిపోయిన పులి మెడ లో వున్న జియో ట్యాగింగ్‌ సహాయంతో దాని కదలికలను ఎప్పటికప్పు డు గుర్తిస్తున్నారు. పెద్ద పులి సంచారానికి సంబంధించిన సమాచారం తో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుండాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. ప్రజలు ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని, రైతులు ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని సూచించారు. ఎప్పటికప్పుడు పోలీస్‌, అటవీ అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని కోరారు. తణుకు రూరల్‌ సీఐ డి.వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ ఎన్‌.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు కోనాల, ముద్దాపురం ప్రజలను అప్రమత్తం చేశారు.

నందమూరు పంట చేలో పెద్ద పులి

తాడేపల్లిగూడెం మండలం నందమూరు పంట చేలో పెద్ద పులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. కాల్దరి నుంచి నందమూరు అక్విడెక్టు సమీపంలోని కెనాల్‌ పంట చేలలో ఉన్నట్టు గుర్తించారు. ఉదయం నుంచి పులి ఆనవాలు కోసం జీపీఎస్‌ ట్రాకర్‌, డ్రోన్‌ కెమేరాలతో అనుక్షణం జల్లెడ పడుతున్నారు. ఈ సమాచారంతో రైతులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రైతులు ఒంటరిగా చేలకు వెళ్లరాదని అధికారులు సూచనలు చేస్తున్నారు.

Updated Date - Oct 10 , 2026 | 12:26 AM