Share News

చింతలపాడులో పెద్దపులి దాడి.. ఆవు మృతి

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:43 AM

అనుకున్న ట్లే పెద్దపులి కావడిగుండ్ల అటవీ మార్గం నుంచి వేలే రుపాడు మండలం సిద్ధారం గ్రామ సమీపంలోకి బుధవారం తెల్లవారుజామున ప్రవేశించింది.

చింతలపాడులో పెద్దపులి దాడి.. ఆవు మృతి

చింతలపాడులో పెద్దపులి దాడి.. ఆవు మృతి

వేలేరుపాడు,జూలై 1 (ఆంధ్రజ్యోతి): అనుకున్న ట్లే పెద్దపులి కావడిగుండ్ల అటవీ మార్గం నుంచి వేలే రుపాడు మండలం సిద్ధారం గ్రామ సమీపంలోకి బుధవారం తెల్లవారుజామున ప్రవేశించింది. సమీప చింతలపాడు గ్రామ పరిధిలో ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ఒక ఆవుపై దాడి చేసి చంపేసింది. గ్రామానికి చెందిన కొరసా సోమరాజు తన ఇంటి సమీపంలో పశువులను దొడ్డిలో ఉంచగా వాటిపై దాడి చేసి ఒక ఆవును కొద్ది దూరం లాక్కుని వెళ్లి చంపివేసింది. అనంతరం సమీపంలోని గట్టుపైకి ఎక్కి అవతల ఉన్న బోళ్లపల్లి వైపు పయనిస్తున్నట్టుగా అటవీ

శాఖ సిబ్బంది గుర్తించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి పగటి పూట కూడా ఒంటరిగా ఎవరూ బయ టకు వెళ్లవద్దని హెచ్చరించారు. గిరిజన గ్రామాల్లో ఇళ్లు చుట్టూ తడికలు, పైన తాటాకులతో కప్పబడి ఉంటాయి. పులి దాడి చేస్తే మానవ నష్టం కూడా జరిగే ప్రమాదం లేకపోలేదు. దీంతో గిరి జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సిన పరిస్థితి. పులిని బంధించేందు కు బోనులను అది పయనించే మార్గంలో అమర్చుతున్నా ఎప్ప టికప్పుడు అది తన మార్గాన్ని మార్చుకోవడంతో ఎలా బంధించాలా అని అటవీ శాఖాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

Updated Date - Jul 02 , 2026 | 12:43 AM