పోలవరం అటవీ ప్రాంతంలోకి పెద్దపులి
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:26 AM
గత రెండు వారాలుగా వేలేరుపాడు మండలంలో అలజడి సృష్టించిన పెద్దపులి అభయారణ్యం గుండా పయనిస్తూ టేకుపల్లి, పేరాంటాలపల్లి గ్రామాల మీదుగా శనివారం నాడు పాపికొండల అభయారణ్యంలోకి చేరుకుని ఆదివారం మధ్యాహ్నానికి పోలవరం మండలంలోని అటవీ ప్రాంతానికి చేరుకున్నట్టు పెద్దపులికి అమ ర్చిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్ సిగ్నల్స్ ద్వారా అటవీశాఖ అధి కారులు నిర్ధారించారు.
వేలేరుపాడు/పోలవరం, జూలై 12 (ఆంధ్రజ్యోతి): గత రెండు వారాలుగా వేలేరుపాడు మండలంలో అలజడి సృష్టించిన పెద్దపులి అభయారణ్యం గుండా పయనిస్తూ టేకుపల్లి, పేరాంటాలపల్లి గ్రామాల మీదుగా శనివారం నాడు పాపికొండల అభయారణ్యంలోకి చేరుకుని ఆదివారం మధ్యాహ్నానికి పోలవరం మండలంలోని అటవీ ప్రాంతానికి చేరుకున్నట్టు పెద్దపులికి అమ ర్చిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్ సిగ్నల్స్ ద్వారా అటవీశాఖ అధి కారులు నిర్ధారించారు. సమీప ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పోలవరం అటవీ క్షేత్రాధికారి ఎస్‌కే వలీ మాట్లాడుతూ పులి గోదావరి దాటి పోల వరం జిల్లా అడవుల్లోకి ప్రవేశించే అవకాశాలు న్నాయని తెలి పారు. గతంలో పోలవరం మండలం ఇటుకలకోట,మెత్తప్పకోట, గుంజవరం, పోలవరం ప్రాజెక్టు ప్రాంతాల్లో పాడిపశువుల్ని చంపి తిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దపులి మళ్లీ పోల వరం అటవీ ప్రాంతానికి వచ్చినట్టు తెలిసి పాపికొండల సమీప గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.