తిరుగుముఖం
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:40 AM
ఐదు రోజులుగా ఆహారం కోసం అలమటిస్తున్న పులి శుక్రవారం బుట్టాయగూడెం మండలంలోకి ప్రవేశించింది. వచ్చీరావడమే ఆకలితో ఉన్న పులి కామవరానికి చెందిన మడివి కృష్ణ పశువులను పొలంలో కట్టివేయగా ఆవు, గిత్తదూడపై దాడిచేసి చంపేసింది.
తిరుగుముఖం
తప్పించుకున్న పులి
తెలంగాణలో కంట్లం వైపు పయనం
బంధించడంలో అధికారులు మళ్లీ విఫలం
బట్టాయగూడెం, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ఐదు రోజులుగా ఆహారం కోసం అలమటిస్తున్న పులి శుక్రవారం బుట్టాయగూడెం మండలంలోకి ప్రవేశించింది. వచ్చీరావడమే ఆకలితో ఉన్న పులి కామవరానికి చెందిన మడివి కృష్ణ పశువులను పొలంలో కట్టివేయగా ఆవు, గిత్తదూడపై దాడిచేసి చంపేసింది. రెండింటిని సుమారు రెండు కిలో మీటర్లు దూరంలోని అడవిలోకి లాక్కుపోయి ఆవు రక్తాన్ని తాగి, దూడను తిని కడుపు నింపుకుంది. బుట్టాయగూడెం మండలం నుంచి జీలుగుమిల్లి మండలంలోకి ప్రవేశించిన పులిని పట్టుకోవడానికి ఐదు రోజులు ఏకదాటిగా అటవీశాఖ అధికారులు సిబ్బంది వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన షూటర్లు, నిణుపులు శ్రమించినా ఫలితం లేకపోయింది. అంకన్నగూడెం సమీపంలోని జామాయిల్ తోటలో నక్కిన పులిని వలలు, మత్తు ఇంజక్షన్లతో అటవీశాఖ అధికారులు సిబ్బంది చుట్టిముట్టారు. తోటలో నుంచి బయటకు రాకుండా బందించారు. ‘యూ’ ఆకారంలో చుట్టి ముట్టిన అధికా రులు పట్టుకునే ప్రయ త్నంలో ఉండగా అర్ధరాత్రి సమ యంలో వలలను పసిగట్టిన పులి సిబ్బందికి అతిసమీపం నుంచే చాకచక్యంగా తప్పించుకుంది. పులిని పట్టుకోవ డంలో విఫలమైన అధికారులు చాకచక్యంగా అడవిలోకి పం పించ గలిగారని ఆదివాసీలు విమర్శిస్తున్నారు. పులి రాష్ర్టా న్ని దాటివెళ్ళినా జిల్లా యంత్రాంగమంతా ఏజెన్సీలోనే మాటు వేశారు. మండలంలోకి ప్రవేశించిన పులి మొదట్లో ఎటునుంచి వచ్చిందో అదే బాట పట్టింది. జనవరిలో కావడిగూండ్ల మీదుగా గుబ్బల మంగమ్మ ఆలయానికి వెళ్ళే దారిలో ఉన్న తెలంగాణ చెక్‌పోస్టుకు కొంచెం దూరంలోని అశ్వారావుపేటకు వెళ్ళే రహదారిని దాటి కామవరం అటవీ ప్రాంతం నుంచి పందిరిమామిడిగూడెం వైపుగా వచ్చింది. మరలా అదే దారిలో పయనిస్తూ కంట్లం వైపుగా తెలంగాణకు వెళ్ళింది.
జింక పిల్లా చిక్కలేదు..
కామవరపుకోట: కామవరపుకోటలోని భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయ పరిసరాల్లో వారం రోజులుగా జింక పిల్ల సంచరిస్తున్న నేప థ్యంలో దానిని పట్టుకునేందుకు అటవీశాఖ, పోలీసు యంత్రాంగం స్థానికులతో కలసి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా అది చిక్కడం లేదు. వలలు ఏర్పాటు చేసినప్పటికీ దొరకడంలేదు. అటవీ శాఖ, పోలీసులు, స్థానికులు రేయింబవళ్ళు ఆ జింకను పట్టుకుని అడవిలో వదిలేందుకు శ్రమిస్తున్నారు. ఎప్పుడు దొరుకుతుందోనని అధికారులు నిరీక్షిస్తున్నారు.