Share News

టిడ్కో..ఊరట!

ABN , Publish Date - May 22 , 2026 | 12:33 AM

టిడ్కో గృహ లబ్ధిదారులకు ఊరట కలగనుంది. టిడ్కో గృహ లబ్ధిదారులు ప్రభుత్వానికి చెల్లిం చిన రూ.14 కోట్లు తిరిగి వారి ఖాతాలో కొద్ది రోజుల్లో జమ చేయనున్నారు.

టిడ్కో..ఊరట!

త్వరలో లబ్ధిదారుల వాటా సొమ్ము చె ల్లింపు

ఏలూరు టూటౌన్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): టిడ్కో గృహ లబ్ధిదారులకు ఊరట కలగనుంది. టిడ్కో గృహ లబ్ధిదారులు ప్రభుత్వానికి చెల్లిం చిన రూ.14 కోట్లు తిరిగి వారి ఖాతాలో కొద్ది రోజుల్లో జమ చేయనున్నారు. 2017లో టీడీపీ ప్రభుత్వం పేదల కోసం టిడ్కో గృహాల నిర్మా ణం చేపడగా 2019 నాటికి కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి. వాటిని లబ్ధిదారులకు అందించే లోపే ఎన్నికలొచ్చాయి. వైసీపీ ప్రభుత్వం అధి కారం చేపట్టగానే 25 శాతం నిర్మాణాలు పూరి ్తకానీ టిడ్కో గృహాలను రద్దు చేసింది. అప్పటికే లబ్ధిదారుల తమ వాటా సొమ్ము చెల్లించేశారు. వైసీపీ ప్రభుత్వం టిడ్కో గృహాలను రద్దు చేయ డంతో అటు ఇళ్లు రాకపోగా లబ్ధిదారుడు వాటా సొమ్ము ప్రభుత్వ ఖాతాల్లోకి వెళ్లడంతో తీవ్ర ఆందోళనలో పడ్డారు. వైసీపీ ఉన్న ఐదేళ్లలో టిడ్కో గృహాల ఊసే ఎత్తలేదు. దీంతో అప్పులు తెచ్చి తమ వాటా చెల్లించిన లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 2019 నుంచి లబ్ధిదా రులు అప్పులు కడుతూనే ఉన్నారు. అనంతరం 2024లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగా నే లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. మాకు ఇళ్లు ఇవ్వకపోయినా

పర్వాలేదు, తాము కట్టిన సొమ్ము అయినా చెల్లించండి అంటూ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. దీనికి స్పందించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ (చంటి) ముఖ్యమంత్రితో, సంబంధిత మంత్రితో పలు దఫాలుగా టిడ్కో గృహ లభ్ధిదారులకు వారి సొమ్ము చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ప్రభుత్వం టిడ్కో గృహ లభ్ధిదారులు చెల్లించిన సొమ్మును వారి ఖాతాల్లో వేసేందుకు అనుమతించింది. జిల్లాలో ఏలూరు నగర పాలక సంస్థ, జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సిపాల్టిల్లో టిడ్కో గృహాల నిర్మాణం చేపట్టింది. ఏలూరులో 6,480 గృహాల నిర్మాణం చేపట్టారు. లబ్ధిదారుల వాటా రూ.19.5 కోట్లు వసూలు చేశారు. వైసీపీ ప్రభుత్వం వీటిలో 4,272 ఇళ్లు రద్దు చేసింది. వీరికి రూ.14 కోట్లు చెల్లించాలి. తాజాగా ఈ మొత్తాన్ని లబ్ధిదారులకు చెల్లించేందుకు రంగం సిద్ధమైంది. టిడ్కో గృహాలు మూడు రకాలుగా నిర్మించారు. 300 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణం గల ఇంటి లబ్ధిదారుల వద్ద నుంచి రూ.500, 365 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణం గల ఇంటి లబ్ధిదారుల వద్ద నుంచి రూ.50,000, 430 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణం గల ఇంటి లబ్ధిదారుల వద్ద నుంచి రూ.లక్ష నగర పాలక సంస్థ కట్టించుకుంది. ఏలూరులో రద్దు చేసిన ఇళ్లను మినహాయిస్తే 2,208 మందికి గృహాలు నిర్మించారు. వీరికి జూన్‌, జూలైలో ఇల్లు అప్పగించే అవకాశాలున్నాయి. నూజివీడులో 4,030 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో 3,600 ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టారు. వీటిలో వెయ్యి ఇళ్లు వైసీపీ ప్రభుత్వం రద్దు చేయగా 2,600 మంది నుంచి లబ్ధిదారుల వాటా కట్టించుకున్నారు. ప్రస్తుతం ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. జంగారెడ్డిగూడెంలో 1,056 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో 192 వైసీపీ రద్దు చేసింది. 864 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. నూజివీడు, జంగారెడ్డిగూడెంలో రద్దు చేసినా ఇళ్ల లబ్ధిదారులకూ త్వరలో వారివాటా చెల్లించనున్నారు. చింతలపూడి మున్సిపాల్టిలో టిడ్కో గృహాల నిర్మాణం చేపట్టలేదు.

Updated Date - May 22 , 2026 | 12:33 AM