Share News

టిడ్కో సొమ్ముకు మోక్షం!

ABN , Publish Date - Mar 22 , 2026 | 12:58 AM

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంగా కారణంగా సొంత గూడు కల చెదిరిన పేదలకు ఊరటనిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

టిడ్కో సొమ్ముకు మోక్షం!
ఏలూరు పోణంగి రోడ్డులోని టిడ్కో ఇళ్లు (ఫైల్‌)

త్వరలో ఖాతాలకు రూ.14.15 కోట్లు

ఏలూరులో అత్యధికంగా 4,272 .. జంగారెడ్డిగూడెంలో 192, నూజివీడులో 97 ఫ్లాట్లు.. అధికారుల కసరత్తు

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంగా కారణంగా సొంత గూడు కల చెదిరిన పేదలకు ఊరటనిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏలూరు కార్పొరేషన్‌, నూజివీడు, జంగా రెడ్డిగూడెంలో టిడ్కో ఫ్లాట్లు కేటాయిం పులు జరగని లబ్ధిదారులకు వారు కట్టిన మొత్తాలను వెనక్కి ఇవ్వాలని ఆదేశాలి చ్చారు. త్వరలో ఆయా మొత్తాల పంపి ణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

టీడీపీ హయాంలో పేదల స్థోమతను బట్టి 300, 365, 430 చదరపు అడుగుల స్థలాల్లో అపార్టుమెం ట్లలో ఫ్లాట్లను అందించేలా టిడ్కో ఇళ్లకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు లబ్ధిదారులు తమ వాటా మొత్తా లను డీడీలు తీసి చెల్లించారు. 2017–18 కాలంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం చోటుచేసుకోవడంతో కొందరు లబ్ధిదారులు డీడీలు తీసినా ఫ్లాట్ల కేటా యింపు జరగలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీరికి ఫ్లాట్లు కేటాయించకుండా వేరొకచోట సెంటు పట్టా స్థలాలను కేటాయించి చేతులు దులుపుకొంది. వాటిని తీసుకోవాల్సిందేనంటూ హుకుం జారీ చేసింది. టిడ్కో ఫ్లాట్లను కేటాయించేది లేదని తేల్చిచెప్పింది. దీంతో లబ్ధిదారులు తాము కట్టిన సొమ్ముల కోసం అధికారులు చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లబ్ధిదారులకు వెనక్కి చెల్లించాల్సిన సొమ్ములపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాఽధాకృష్ణయ్య (చంటి) అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించారు. ఈక్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్ల దుస్థితిపై ప్రభుత్వం స్పందించింది. లబ్ధిదారులకు త్వరలో వారు చెల్లించాల్సిన మొత్తాలను వెనక్కి ఇవ్వ నున్నారు.

4,561 మంది.. రూ.14.15 కోట్లు

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు రూ.50 వేలు, సింగిల్‌ బెడ్‌రూమ్‌ రూ.25 వేలు చొప్పున ఆయా మున్సిపాలిటీల్లో ఫ్లాట్లకు లబ్ధిదారులు కమిషనర్ల పేరిట డీడీలను తీశారు. ఏలూరులోని పోణంగి, కొత్తూరులో 4,272 మంది రూ.14 కోట్లు అత్య ధికంగా డీడీలను సమర్పించారు.జంగారెడ్డిగూ డెంలో 192 మంది రూ.11 లక్షలు, నూజి వీడు పురపాలక సంఘంలో 97 మంది రూ.4.35 లక్ష లను చెల్లించారు. ఆ మొత్తాలను వారికి వెనక్కి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రెండు సెంట్ల పట్టాలు ఇస్తారా?

పురపాలక సంఘాల్లో నివసించే వారికి కూటమి ప్రభుత్వం రెండు సెంట్ల పట్టాలను జారీ చేయాలని నిర్ణయించింది. టిడ్కోలో ఫ్లాట్లు కేట యింపు జరగలేని వారికి ముందుగా ప్రాధాన్యం ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. తాము కట్టిన సొమ్ముల కోసం ఎదురు చూసిన పేదలకు రెండు సెంట్ల పట్టాలను ఇవ్వాలని పలువురు ప్రజా ప్రతి నిధులు విజ్ఞప్తులు చేశారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది. రెండు సెంట్ల పట్టాలు విషయమై తమకు సమాచారం లేదని, ఫ్లాట్ల కేటాయింపులు జరగని వారికి ఆయా మొత్తాలను వెన క్కి ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయని టిడ్కో అధికారులు తెలిపారు.

Updated Date - Mar 22 , 2026 | 12:58 AM