సాధించారు.!
ABN , Publish Date - Feb 26 , 2026 | 01:12 AM
సహకార సంఘాల ఉద్యోగులు తొమ్మిది రోజులు పాటు చేపట్టిన నిరవధిక సమ్మెతో వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి మార్గం సుగమం అయ్యింది.
సహకార సంఘాల ఉద్యోగులు తొమ్మిది రోజులు పాటు చేపట్టిన నిరవధిక సమ్మెతో వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి మార్గం సుగమం అయ్యింది. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో వారు ఆందోళన విరమించారు. గ్రాడ్యూటీ, జీతాలు పెంపుదల డిమాండ్లను సాధించుకున్నారు. దీంతో రెట్టించిన ఉత్సా హంతో బుధవారం విధులకు ఉద్యోగులు హాజరయ్యారు.
(ఏలూరు/ముదినేపల్లి,ఆంధ్రజ్యోతి):
సహకార సంఘాల్లో ఉద్యోగులు పోరుబాట ముగి సింది. ఏ ప్రభుత్వంలోను పొందలేని ప్రయోజనాలను ఎట్టకేలకు కూటమి ప్రభుత్వంలో సాధించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సొసైటీల కం ప్యూటరీకరణను చేపట్టారు. దీంతో ఉద్యోగులపై పని భారం పెరిగింది. మరోవైపు ధాన్యం కొనుగోలు సేకరణ, పెండింగ్ బకాయిల వసూళ్లతో క్షేత్రస్థాయిలో ఉద్యోగుల అరకొర జీతాలతో ఇబ్బందులు పడుతున్నారు. రెండు నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళన చేపట్టిన ఉద్యోగులు ఇటీవల నిరవధిక సమ్మెకు దిగడంతో ప్రభుత్వం వారి కోర్కెలను సానుకూల వాతావరణంలో పరిష్కరించడానికి అంగీకరించింది. దీంతో బుధవారం సమ్మెను విరమించి విధులకు హాజరయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 257 సహకార సంఘాలున్నాయి. ఇందులో పర్మి నెంట్‌గా చేసే వివిధ హోదాల్లో 1200 మంది ఉద్యోగు లు పనిచేస్తున్నారు. వీరి డిమాండ్లను గత వైసీపీ ప్రభు త్వం కనీసం పట్టించుకోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సహకార ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దశల వారీగా ప్రయోజనాలు నెరవేర్చుతోంది. ఉద్యోగ విరమణ పొందాక ఇప్పటివరకు ప్రభుత్వం వారికి రూ.రెండు లక్షలనే గ్రాడ్యూటీగా చెల్లిస్తోంది. ఈ ఆందోళన ఫలితంగా వారు రూ.నాలుగు లక్షలు గ్రాడ్యూ టీని పొందనున్నారు. రెట్టింపు మొత్తం ఇవ్వడానికి సాను కూలంగా ప్రభుత్వం అంగీకరించింది. త్వరలో విధి విధానాలను రూపొందించ నున్నారు. జీతంపై 20 శాతం పెంపుదలకు అంగీకారం కుదిరింది. ఇప్పుడు సర్వీసులో ఉన్న ఉద్యోగులు కనీసం రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు జీతంగా పొందుతున్నారు. ప్రభుత్వం జీతం పెంపు దలకు అంగీకరించడంతో కనీసంగా రూ.నాలుగు వేల నుంచి రూ.ఆరు వేల వరకు జీతాలు పెరగనున్నాయి.
ఆరోగ్య బీమాతో మరింత ధీమా..
సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇప్పటి వరకు రూ.రెండు లక్షల వరకే బీమా సౌకర్యం అమలవుతుండగా దీనిని రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు పరిమితిని పెంచారు. అనుకోని రీతుల్లో ప్రమాదాల్లో చిక్కుకున్న ఉద్యోగులకు ఈ బీమా పెంపు మరింత ధీమా ఇవ్వనుంది.
సంతోషకర పరిణామం..
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగుల పలు డిమాండ్ల పరిష్కారానికి సీఎం చంద్రబాబు, సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సానుకూలత వ్యక్తం చేయడం సంతోషకర పరిణామం. పీఏసీఎస్ ఉద్యోగులకు గ్రాడ్యూటీని రూ. 2 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచడం, ఉద్యోగుల జీతాలను 20 శాతం పెంపుతో మధ్యంతర భృతి చెల్లించడం, ప్రతి ఉద్యోగికి మెడికల్ హెల్త్ ఇన్సూరెన్సు ఫథకాన్ని అమలు చేయాలన్న నిర్ణయాలు ఉద్యోగులకు ఎంతో ఊరట కలిగించాయి. ప్రభుత్వం నియమించిన హైలెవల్ కమిటీ ఇతర సమస్యల పరిష్కారంలో సానుకూలంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాం.
– బొల్లినేని రఘురామ్, ఏపీపీఏసీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
ఉద్యోగులకు ప్రయోజనం
పీఏసీఎస్ ఉద్యోగుల ఆందోళన ఫలించింది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావడం, సమస్యల పరిశీలనకు కమిటీ వేయడం శుభపరిణామం. దీర్ఘకాలిక డిమాండ్లు పరిష్కారం కాగాలవన్న నమ్మకం కలిగింది.
– పళ్ళెం శ్రీనివాసరావు, ఏపీపీఏసీఎస్ ఎంప్లాయీస్ జిల్లా ఉపాధ్యక్షుడు