Share News

ఆ హక్కు జగన్‌కు లేదు

ABN , Publish Date - Aug 08 , 2026 | 12:39 AM

‘రైతుల సమస్యల పై మాట్లాడే నైతిక హక్కు వైఎస్‌ జగన్‌కు లేదు. ఆయ న సీఎంగా ఉన్నప్పుడు వారి సమస్యలను గాలికొదిలే శారు. పొగాకు, ఆక్వా రైతులకు చేసిందేంలేదు.

ఆ హక్కు జగన్‌కు లేదు
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ జోనల్‌ ఇన్‌చార్జ్‌ ప్రత్తిపాటి, ఎమ్మెల్యే చంటి తదితరులు

జరిగిన మేలంతా కూటమి ప్రభుత్వంలోనే

సీఎం పర్యటనను విజయవంతం చేయాలి

మాజీ మంత్రి ప్రత్తిపాటి, టీడీపీ అధ్యక్షుడు చంటి

కైకలూరు, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి):‘రైతుల సమస్యల పై మాట్లాడే నైతిక హక్కు వైఎస్‌ జగన్‌కు లేదు. ఆయ న సీఎంగా ఉన్నప్పుడు వారి సమస్యలను గాలికొదిలే శారు. పొగాకు, ఆక్వా రైతులకు చేసిందేంలేదు. కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్న మంచిని చూసి ఓర్వ లేక బురద జల్లుతున్నారు’ అని టీడీపీ జోనల్‌ ఇన్‌చార్జి, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఈ నెల 10న కలిదిండిలో జరగనున్న సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం కైకలూరులో పర్యటించా రు. టీడీపీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో మా ట్లాడుతూ ‘గ్రామస్థాయిలో కూటమి నాయకుల మధ్య చిన్న చిన్న సమస్యలుంటే వాటిని పక్కన పెట్టి కలిసి పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలి. నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారమయ్యే వాటిని సభావేదిక నుంచే సీఎం ప్రకటిస్తారు’ అని తెలిపారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) మాట్లా డుతూ సీఎం పర్యటనలో కాళ్లపాలెంకు చెందిన 600 మంది రైతులకు సీఎం పట్టాదారు పాస్‌ పుస్తకాలు పంపిణీ చేస్తారు. నియోజకవర్గ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, వివరిస్తారన్నారు. సీఎం సభను విజయవంతం చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు, టీడీపీ కన్వీనర్‌ వీరమల్లు నరసిం హారావు, కో కన్వీనర్‌లు బొమ్మనబోయిన విజయలక్ష్మీ, కొడాలి వినోద్‌, బలే ఏసురాజు పాల్గొన్నారు.

Updated Date - Aug 08 , 2026 | 12:39 AM