Share News

పది పరీక్షలు ప్రశాంతం

ABN , Publish Date - Mar 16 , 2026 | 11:40 PM

పదో తరగతి తొలి రోజు సోమవారం తెలుగు పరీక్ష జరిగింది. 23,415 విద్యార్థులకు 23,044 (98.42 శాతం) మంది పరీక్ష రాశారు.

పది పరీక్షలు ప్రశాంతం
భీమవరం పీఎస్‌ఎం స్కూల్‌లో తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ నాగరాణి, డీఈవో నారాయణ

తెలుగు పరీక్షకు 371 మంది గైర్హాజరు

66 కేంద్రాల్లో తనిఖీలు

భీమవరం రూరల్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి తొలి రోజు సోమవారం తెలుగు పరీక్ష జరిగింది. పరీక్ష సమయం 9.30 గంటల అయితే 8.45 నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకుని హాల్‌ టిక్కెట్స్‌ నంబర్లను నోటీసు బోర్డుల్లో చూసుకుని పరీక్ష కేంద్రంలోకి వెళ్లారు. మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా రాశారు. జిల్లాలో 132 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరగ్గా 23,415 విద్యార్థులకు 23,044 (98.42 శాతం) మంది పరీక్ష రాశారు. 371 మంది హాజరు కాలేదు. పరీక్ష మొదటి రోజు జిల్లా కలెక్టర్‌ ఒక కేంద్రం, డీఈవో నారాయణ 9 కేంద్రాలను తనిఖీ చేశారు.జిల్లా పరీక్షల కో–ఆర్డినేటర్‌, జిల్లా స్థాయి పరిశీలకులు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్‌ మొత్తం 66 కేంద్రాలను తనిఖీ చేశారు. ఎటువంటి మాస్‌ కాపీయింగ్‌ జరగలేదు.

ఏపీ ఓఎస్‌ఎస్‌ పరీక్షలకు 39 మంది గైర్హాజరు

ఏపీ ఓఎస్‌ఎస్‌ పరీక్షలకు 39 మంది గైర్హాజరయ్యారు. సోమవారం తెలుగు, ఉర్ధూ పరీక్ష జరిగింది. 240 విద్యార్థులకు 201 విద్యార్థులు హాజరయ్యారు.

Updated Date - Mar 16 , 2026 | 11:40 PM