గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాలి
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:30 AM
క్రీడల్లో గెలుపోటములు సహజమని, అయితే గెలుపే లక్ష్యంగా, పట్టుదలతో ప్రతి క్రీడాకారుడు బరిలోకి దిగాలని రిటైర్డ్ ఎస్పీ నక్క సూర్యచంద్రరావు అన్నారు.
రిటైర్డ్ ఎస్పీ సూర్యచంద్రరావు
సెప్టెంబరు 18 నుంచి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు
ఏలూరు రూరల్, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి):క్రీడల్లో గెలుపోటములు సహజమని, అయితే గెలుపే లక్ష్యంగా, పట్టుదలతో ప్రతి క్రీడాకారుడు బరిలోకి దిగాలని రిటైర్డ్ ఎస్పీ నక్క సూర్యచంద్రరావు అన్నారు. సోమవారం ఏలూరులో ఆంధ్ర టెన్నిస్ బాల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మంగళగిరి కంతేరు డాక్టర్స్ స్పోర్ట్స్ అకాడమీలో సెప్టెంబరు 18 నుంచి 26వరకు ఆంధ్ర టెన్నిస్ బాల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు.. ప్రతిభను చాటుకునే క్రీడాకారులకు మంచి వేదికగా నిలుస్తుందన్నారు. టెన్నిస్ బాల్ క్రికెట్ ప్రస్తుతం కొత్త ఒరవడిని సృష్టిస్తోందని, క్రీడాకారులు పోటీలను అవకాశంగా మలుచుకుని తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు. భీమవరం బ్లాస్టర్స్ టీం ఫ్రాంచైజీలు గరికముక్కు గౌతమ్, అబ్బూరి అనిల్ మాట్లాడుతూ టెన్నిస్ బాల్ క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహిం చడంతో పాటు వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు టీంను కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఆపరేషన్స్ సెంటర్ హెడ్ కోటేశ్వర రావు మాట్లాడు తూ రాష్ట్రంలోని 670 మండలాల్లో గ్రీన్ టికెట్ సెలక్షన్స్ నిర్వహించి 350 మంది క్రీడాకా రులను ఎంపిక చేశామని, వేలం ద్వారా 150 మంది ప్రతిభావంతులను ఎంపిక చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలోని 12జోన్ల జట్లు పోటీల్లో పాల్గొంటాయన్నారు. ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు, సాయి స్వర్ణ మోటార్స్ మేనేజర్ ఏవీ సోమేశ్వరరావు, టీం సభ్యులు పాల్గొన్నారు.