35 పుష్కర రేవులకు టెండర్లు ఖరారు
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:35 AM
గోదావరి పుష్కరాలకు స్నానాల రేవుల టెండర్లు ఖరారయ్యాయి.
వచ్చే నెలలో పనులకు సన్నాహాలు
ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం
నరసాపురం, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలకు స్నానాల రేవుల టెండర్లు ఖరారయ్యాయి. సిద్దాంతం నుంచి నరసాపురం మండలం బియ్యపుతిప్ప వరకు ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాల్లో 35 స్నా నాల రేవుల విస్తరణ, అభివృద్ధి, కొత్త రేవుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.39.13 కోట్లు కేటాయించింది. దఫదఫా లుగా టెండర్లు పిలిచి అన్నింటిని ఖరారు చేశారు. ఎన్ని కల కోడ్ ఉండటంతో పనులు పెండింగ్ పడ్డాయి. ఇప్ప టికే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లతో ప్రభుత్వం ఒప్పందం పనులు పూర్తి చేసింది. డిసెంబరు మొదటి వారంలో పనులు ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది.
నాలుగు అతి పెద్ద రేవులు..
జిల్లాలో ఈసారి నాలుగు స్నానాల ఘాట్లను విస్త రిస్తున్నారు. వాటిలో నరసాపురం అమరేశ్వర, వలంధర్, యలమంచిలి లక్ష్మిపాలెం, సిద్దాంతం రేవులు ఉన్నాయి. వలంధర్ రేవును 40 మీటర్ల నుంచి 80 మీటర్లకు పెం చుతున్నారు. ఇందుకు రూ.1.04 కోట్లు ఖర్చు చేస్తున్నా రు. అమరేశ్వర రేవును 40 మీటర్లకు పెంచుతున్నారు. దీనికి రూ.95 లక్షలు కేటాయించారు. సిద్దాంతంలో మూడు రేవులను ఒకటిగా చేసి 140 మీటర్ల అతి పెద్ద రేవు నిర్మిస్తున్నారు. దీనికి రూ.4 కోట్లు ఖర్చు చేస్తున్నా రు. లక్ష్మిపాలెం రేవుకు రూ.60 లక్షలు ఖర్చు చేస్తు న్నారు. మొత్తం 35 రేవుల్లో నరసాపురంలో 12, యల మంచిలి 13, ఆచంట మండలంలో 10 రేవులు ఉన్నా యి. వీటిలో అత్యధికంగా పాత రేవులను ఆధునీకరిస్తు న్నారు. కొన్ని రేవులను ఐదు నుంచి 15 మీటర్ల మేర పెంచుతున్నారు. ఇప్పటికే టెండర్లు ప్రక్రియ పూర్తికావ డంతో ఎన్నిక కోడ్ ముగియగానే.. పనులు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు.
దీనిపై ఏటిగట్టు శాఖ ఏఈ పవన్ను వివరణ కోరగా.. ‘మొత్తం 35 రేవులకు టెండర్ల ప్రక్రియ పూర్త యింది. ఎన్నికల కోడ్ ముగియగానే పనులు చేపట్టేం దుకు రెడీగా ఉన్నాం. ఏప్రిల్ నాటికి అన్ని రేవుల పను లు పూర్తి చేస్తాం’ అని తెలిపారు.