Share News

పుష్కర ఘాట్‌లకు టెండర్లు

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:46 AM

గోదావరి పుష్కరాలకు ప్రతిపాదించిన స్నానాలు రేవుల టెండర్లు ప్రక్రియను ఏటిగట్టు శాఖ చేపట్టింది.

పుష్కర ఘాట్‌లకు టెండర్లు
నరసాపురం వలంధర్‌ రేవు

రూ.8 కోట్లతో 12 స్నానాల రేవులకు ఆమోదం

ఇప్పటికే రెండు ఓకే

వచ్చేనెల 5న పెండింగ్‌ టెండర్లు ఓపెన్‌

నరసాపురం, సెస్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలకు ప్రతిపాదించిన స్నానాలు రేవుల టెండర్లు ప్రక్రియను ఏటిగట్టు శాఖ చేపట్టింది. నరసాపురం తీరంలో మొత్తం 12 స్నానాల రేవులను నిర్మించాలని ప్రతిపాదిం చారు. వీటికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో రూ.8 కోట్లతో టెండర్లు పిలిచారు. వాటిలో బియ్యపుతిప్ప, పీచుపాలెం టెండర్ల ఓకే అయ్యాయి. వీటికి రూ.90 లక్షలు వెచ్చించ నున్నారు. మిగిలిన 10 టెండర్లను వచ్చే నెల 5 లోపు తెరవనున్నారు. తీరం వెంబడి రోడ్డు మార్గాలు విస్తరణ, రైల్వే వ్యవస్థ పెరగడంతో ఈసారి గోదావరి పుష్కరాలకు నరసాపురం వశిష్ఠ గోదావరిలో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. దానిని అనుగుణంగానే స్నానాల రేవుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం కల్పించింది. ప్రస్తుతం ఉన్న రేవులు విస్తరణతో పాటు కొత్త రేవుల ప్రతిపాదనకు ఒకే చెప్పింది.

గతంలో నరసాపురం తీరంలో 8 స్నానాలు రేవులు ఉండేవి. ఈసారి 12కు పెంచారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న రేవులను విస్తరించనున్నారు. మొత్తం ఈ పనులకు రూ.8 కోట్లు కేటాయిం చింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. పీచుపాలెం రేవుకు రూ.90 లక్షలతో టెండర్లు ఆహ్వానించగా ఇద్దరు గుత్తేదారులు దక్కించుకున్నారు. మిగిలిన 10 రేవు లకు వచ్చే నెల 5న టెండర్లు తెరవను న్నారు. అందులో వలంథర్‌ రేవును 40 మీటర్ల ఉన్న రేవును 70 మీటర్ల వరకు పెంచనున్నారు. ఇందుకు రూ.1.05 కోట్లు వెచ్చిం చనున్నారు. అలాగే కొండాలమ్మ, అమరేశ్వర రేవులను కూడా పెంచనున్నారు. ప్రస్తుతం ఉన్న 40 మీటర్ల ఉన్న ఈ రెండు రేవుల్ని 50 మీటర్ల మేరకు పెంచనున్నారు. ఇందుకు రూ.1.60 కోట్లు టెండర్లు పిలిచారు. మిగిలిన పట్టణంలో రేవులను కూడా ఐదు మీటర్ల పెంచి భక్తులకు ఇబ్బందులు లేకుండా డ్రెస్సింగ్‌ రూమ్‌లు కట్టనున్నారు.

Updated Date - Sep 30 , 2026 | 12:46 AM