Share News

ఆలయాల్లో హుండీల సొమ్ము లెక్కింపు

ABN , Publish Date - Mar 25 , 2026 | 11:52 PM

ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ఆలయాల్లో బుధవారం హుండీల సొమ్ము లెక్కించారు. భీమవరం మావుళ్లమ్మ ఆలయ హుండీలను బుధవారం లెక్కించ గా 26 రోజులకుగాను 25లక్షల 63వేల 619 రూపాయిలు ఆదాయం వచ్చిందని దేవస్ధానం సహాయ కమిషనర్‌ బుద్ధా మహాలక్ష్మినగేష్‌ తెలిపారు.

ఆలయాల్లో హుండీల సొమ్ము లెక్కింపు
భీమవరం మావుళ్లమ్మ ఆలయంలో హుండీల సొమ్ము లెక్కిస్తున్న సిబ్బంది

మావుళ్లమ్మ హుండీ ఆదాయం రూ.25.63 లక్షలు

భీమవరంటౌన్‌, మార్చి 25(ఆంధ్రజ్యోతి):ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ఆలయాల్లో బుధవారం హుండీల సొమ్ము లెక్కించారు. భీమవరం మావుళ్లమ్మ ఆలయ హుండీలను బుధవారం లెక్కించ గా 26 రోజులకుగాను 25లక్షల 63వేల 619 రూపాయిలు ఆదాయం వచ్చిందని దేవస్ధానం సహాయ కమిషనర్‌ బుద్ధా మహాలక్ష్మినగేష్‌ తెలిపారు. నగదుతోపాటు 30 గ్రాముల బంగారం, 55 గ్రాముల వెండి వచ్చిందన్నారు. కాకినాడ పట్టణం ఎంఎస్‌ఎం చారిటీస్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ చాగంటి సురేష్‌నాయుడు పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మ, ఆలయ చైర్మన్‌ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్‌, ఉదశీ మీనాక్షి, జి.రమణ, మిర్తిపాటి గుణేశ్వరరావు, ఎ.ఆంజనేయప్రసాద్‌, మల్లువలస లక్ష్మీనిర్మల, మత్స్యపురి గ్రూప్‌ టెంపుల్స్‌ కార్యనిర్వహణాధికారి రఘునాథ్‌, కలిగొట్ల గ్రూప్‌ టెంపుల్స్‌ కార్యనిర్వహణాధికారి మంతెన రామరాజు, కరూర్‌ వైశ్య బ్యాంకు సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పెద్దింటమ్మ ఆలయానికి రూ.29.65 లక్షలు

కైకలూరు : కొల్లేటికోట పెద్దింటమ్మ ఆలయ హుండీలను 91 రోజులకు గాను బుధవారం లెక్కించగా రూ.29,65,308 వచ్చిందని ఈవో కూచిపూడి శ్రీనివాస్‌ తెలిపారు. ఎండోమెంట్‌ తనిఖీ అధికారి జి.పవన్‌కుమార్‌ పర్యవేక్షణలో ధర్మకర్తల మండలి చైర్మన్‌ జల్లూరి వెంకన్నబాబు, సభ్యులు, అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

అప్పనవీడు ఆంజనేయుడికి రూ.7.68 లక్షలు

పెదపాడు : అప్పనవీడు అభయాంజనేయస్వామి హుండీల సొమ్ము లెక్కించగా రూ.7,68,257 ఆదాయం వచ్చిందని ఆలయ చైర్మన్‌ వేమూరి శ్రీనివాసరావు తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో అధికారులు, పాలక మండలి, భక్తుల సమక్షంలో 55రోజులకు హుండీ లెక్కింపు నిర్వహించారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో పెదపాడు గ్రూపు దేవాలయాల పర్యవేక్ష ణాధికారి పి.కుమారి పరిశీలించారు. దేవాలయ ఈవో పి.తారకేశ్వరరావు, భక్తులు పాల్గొన్నారు.

బండి ముత్యాలమ్మకు రూ.22.05 లక్షలు

మొగల్తూరు : ముత్యాలపల్లి బండి ముత్యాలమ్మ హుండీల సొమ్ము ఆదాయాన్ని 76 రోజులకు గాను బుధవారం లెక్కించగా 22 లక్షల 5వేల 199 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో మోకా అరుణ్‌కు మార్‌ తెలిపారు. ఆకివీడు గ్రూపు దేవాలయాల ఈవో ఏవీ సత్యనారాయ ణరాజు పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహించారు. కార్యక్రమంలో పలు దేవాలయాలకు చెందిన సిబ్బంది, భక్తులు, మాజీ పాలకవర్గ సభ్యులు, చైర్మన్‌లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2026 | 11:52 PM