Share News

ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి నూతన ట్రస్టుబోర్డు

ABN , Publish Date - Apr 18 , 2026 | 12:13 AM

ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నూతన ట్రస్టుబోర్డును నియమిస్తూ ఎక్స్‌అ షిషియో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి నూతన ట్రస్టుబోర్డు
చైర్మన్‌ రాజా ఎస్వీ సుధాకరరావు

ద్వారకాతిరుమల, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి):ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నూతన ట్రస్టుబోర్డును నియమిస్తూ ఎక్స్‌అ షిషియో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ట్రస్టు బోర్డు చైర్మన్‌గా ఫౌండర్‌ కుటుంబ సభ్యుడు, ఎక్స్‌ అఫీషియో సభ్యునిగా ఆలయ ప్రధాన అర్చ కునితోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో 16 మంది సభ్యులకు అవకా శం కల్పించారు. ట్రస్టు బోర్డు చైర్మన్‌గా రాజా ఎస్వీ సుధాకరరావు, సభ్యులుగా చింతమనేని హనుమంతరావు (వేంపాడు), క ంపసాటి నాగసీత (ద్వారకా తిరుమల), యలమాటి శ్రీనివాసరావు (నల్ల జర్ల), అచ్యుత సత్యన్నారాయణ (ఆవపాడు), పాలూరి వెంకట చరిత (యర్నగూడెం), కడియం సత్యవతి (దుద్దుకూరు), హూత వీరభధ్రరావు (హుకుంపేట), చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య (ఏలూరు), పల్లి శ్రీనివాసరెడ్డి (అనపర్తి), కాకి సురేష్‌ కుమార్‌, అల్ది సత్యన్నారాయణ (తణు కు), కింకాడ కళావతి (నెల్లిమర్ల), బత్తిన ప్రమీల (గూడూరు), చిరు గూరి సుశీల (ప్రత్తిపాడు), కాసిరెడ్డి మధులత (తాడేపల్లిగూడెం), యూకే సుహాసిని (ఎమ్మిగనూరు)లను నియమి ంచారు. ఆలయ చైర్మన్‌, ఎక్స్‌ అఫిషియో సభ్యులను మినహాయించి ఎంపికైన 16 మందిలో 13 మంది టీడీపీ, ఇద్దరు జనసేన, ఒకరు బీజేపీకి చెందిన వారు వున్నారు. వీరి పదవీ కాలం రెండేళ్లపాటు ఉంటుంది. ప్రత్యేక ఆహ్వానితులుగా కొవ్వూరు, పోలవరం, గోపా లపురం నియోజకవర్గాలకు చెందిన ముప్ప రాజు శ్రీనివాసరావు, గెడ్డమణుగు రవి కుమార్‌, తాండ్ర సందీప్‌లను నియమించారు.

Updated Date - Apr 18 , 2026 | 12:13 AM