జాతరకు సర్వం సన్నద్ధం
ABN , Publish Date - Jan 31 , 2026 | 12:19 AM
పడమరవీధిలో జరుగుతున్న గంగానమ్మ జాతర కార్యక్రమాల్లో భాగంగా మేడల్లో కొలువై ఉన్న అమ్మవార్లను శుక్రవారం ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ కె.ప్రతాప శివకిషోర్‌లు దర్శించుకుని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏలూరు పడమరవీధిలో గంగానమ్మకు ఐజీ, ఎస్పీల ప్రత్యేక పూజలు... జాతర ఏర్పాట్ల పరిశీలన
ఏలూరు కార్పొరేషన్/ఏలూరు క్రైం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): పడమరవీధిలో జరుగుతున్న గంగానమ్మ జాతర కార్యక్రమాల్లో భాగంగా మేడల్లో కొలువై ఉన్న అమ్మవార్లను శుక్రవారం ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ కె.ప్రతాప శివకిషోర్‌లు దర్శించుకుని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఐజీ, ఎస్పీలకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఫిబ్రవరి 1,2 తేదీల్లో జరిగే పెద్ద జాతరకు జరిగే మహాకుంభ నివేదన తదితర కార్యక్రమాలకు నిర్వాహకులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. మేడల వద్దకు అమ్మవార్లు ఏ వైపు నుంచి వస్తారు, కుంభం ఎక్కడ పోస్తారు, ఎటు నుంచి బయటకు వెళ్తారనే వివరాలను సమగ్రంగా బారికేడ్లు తిరిగి పరిశీలించారు. జాతర కొలుపుల కమిటీ అధ్యక్షులు చోడే బాలసుబ్రహ్మణ్యం (బాలు), ఏపీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ చోడే వెంకట రత్నం, మధ్యాహ్నపు మహేశ్వరరావు, మధ్యాహ్నపు రామకృష్ణదాసు, బత్తుల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
మేడల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు
ఫిబ్రవరి ఒకటవ తేదీన మహాకుంభ నివేదన జరుగు నేపథ్య ంలో శుక్రవారం మేడల్లోని అమ్మవార్లను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని పసుపు, కుంకుమలతో అర్చనలు జరిపి నివేదనలు సమర్పించారు. పలువురు భక్తులు సారెను అమ్మవార్లకు సమర్పిం చారు. దీంతో పడమర జాతర వద్ద సందడి నెలకొంది.
నేడు మేడల వద్దకు కొర్లబండి
జాతర కార్యక్రమాల్లో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీన అమ్మవార్లను సాగ నంపే కొర్లబండిని శనివారం మేళతాళాలు, బాజాభజంత్రీలతో ఊరేగింపుగా పడమరవీధిలోని మేడల వద్దకు తీసుకువచ్చే కార్యక్రమంలో భక్తులు పాల్గొనా లని పడమరవీధి జాతర కమిటీ అధ్యక్షులు చోడే బాల సుబ్రహ్మణ్యం(బాలు) తెలిపారు.
జాతరకు మునిసిపల్ సిబ్బంది సమాయత్తం
ఏలూరు టూటౌన్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): పడమర వీధి అమ్మవార్ల జాతర ముగింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేస్తున్నామని నగర పాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో పెదబాబు మాట్లాడుతూ జాతరకు ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చే లక్షలాదిమంది ప్రజానీకానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జాతరకు వచ్చే ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకుని శానిటరీ సిబ్బంది, ఇన్‌స్పెక్టర్లు, మేస్ర్తీలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు. 150మందిసిబ్బందితో మూడు షిప్టులు డ్యూటీలు వేశామన్నారు.
జాతరకు భారీ బందోబస్తు
ఏలూరు క్రైం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఏలూరు నగరంలోని పడమర వీధిలో గంగానమ్మ జాతరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ తెలిపారు. ఏలూరు డీఎస్పీ కార్యాల యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతరకు తీసుకున్న చర్యలు, ట్రాఫిక్ ఆంక్షలు, నిబంధనలను డీఎస్పీ వెల్లడించారు. ఆయనతో పాటు ఏలూరు వన్‌టౌన్ సీఐ జి.సత్యనారాయణ, ఎస్‌ఐ వై.సుఽ దాకర్ పాల్గొన్నారు. డీఎస్పీ శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ ఈనెల 1,2 తేదీలలో ఈ జాతర జరుగుతుందని సుమారు 6 నుంచి 7 లక్షల మంది భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నా మన్నారు. 800 మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తామని, పోలీస్ బాంబ్ డిస్పోజబుల్ స్వాడ్‌లు, స్పెషల్ రోప్ పార్టీలు, నిఘా విభాగ సిబ్బందిని నియమించామన్నారు. కొరలబండి ఊరే గింపు జరిగే మార్గాల్లో ఎవ్వరు రోడ్లపైన వాహనాలు పార్కింగ్ చేయ కూడదని, ఒక వేళ ఎవరైనా కార్లు కాని, ఇతర వాహనాలు పార్కింగ్ చేస్తే టోయింగ్ వెహికల్ ద్వారా వాటిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తామన్నారు. వారి పై కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. మద్యంతాగి అమ్మవారి ఊరే గింపుకు వస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు కొరల బండిని తాకడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఇలాంటివి మానుకోవాలని సూచించారు. ఈనెల 31వ తేదీ అర్ధరాత్రి నుంచి కుంభం పోయడం ప్రారంభం అవుతుందని అన్నారు.
వాహనాల దారి మళ్ళింపు
ఏలూరు నగరంలో ఈనెల 1వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 2వ తేదీ అర్ధరాత్రి వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ చెప్పారు. ఏలూరు పడమరవీధి గంగానమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఏలూరు నగరంలోకి భారీ వాహనాలను ఎట్టి పరిస్థి తుల్లోనూ అనుమతిలేదన్నారు.
ఫ విజయవాడ నుంచి కైకలూరు వైపు వెళ్ళే వాహనాలు హనుమాన్‌జంక్షన్, గుడివాడ, ముదినేపల్లి, మండవల్లి మీదుగా వెళ్ళాలన్నారు.
ఫ ఏలూరు ఆశ్రం ఆసుపత్రి వైపు నుంచి కైకలూరు వైపు వెళ్ళే వాహనాలు ఏలూరు ఆశ్రం ఆసుపత్రి, గూడ్స్ షెడ్ వైపు ఉన్న రైల్వే స్టేషన్ వద్ద నుంచి కొమడవోలు బ్రిడ్జి మీదుగా కొమ డవోలు, జాటపర్రు, జాలిపూడి, కాట్లంపూడి, శ్రీపర్రు మీదుగా వెళ్ళాలన్నారు.
ఫ కైకలూరు వైపు నుంచి విజయవాడ వెళ్ళే వాహ నాలు లోకుమూడి, ఆకివీడు, గణపవరం, ఉండి, నారాయ ణపురం, చేబ్రోలు, గుండుగొలను మీదుగా ఏలూ రు ఆశ్రం ఆసుపత్రి జాతీయ రహదారి మీదుగా వెళ్ళాల న్నారు.
ఫ ఏలూరు నగరంలో ద్విచక్ర వాహనాలు వన్‌టౌన్ ప్రాంతంలో దారి మళ్ళింపు చేస్తున్నామని ఇది నగర ప్రజలు గమనించాలన్నారు. మాదేపల్లి ఇండియన్ ఆయిల్ బంక్, ఫిల్‌హౌస్‌పేట సెంటర్, బనానా బార్ సెంటర్, సత్యనారాయణ థియేటర్, పాండు రంగా థియేటర్ సెంటర్, అజంతా సెం టర్, పాతబస్టాండ్ మీదుగా వెళ్ళాలన్నారు.
ఫ జాతరకు వచ్చే భక్తులు వంగాయిగూడెం అంబేడ్కర్ విగ్రహం వెనుక ఖాళీ ప్రదేశం, పంపులచెరువు రోడ్డు, కోటదిబ్బపైన జూనియర్ కాలేజీ, మాదేపల్లి ప్రేమాలయం వద్ద ఉన్న కెకెరాజు లేఅవుట్లలో తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.