వేడిగాలులు.. ఉక్కపోత
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:18 AM
జిల్లాలో ఉష్ణోగ్రతల తీవ్రత మళ్లీ పెరుగు తోంది. రోహిణి కార్తె ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. కృత్తిక కార్తెలో నమోదైనట్టు తారాస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాక పోయినా ఎండ తీవ్రత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.
మళ్లీ పెరిగిన ఉష్ణోగ్రతలు
చింతలపూడి, ఆగిరిపల్లి మండలాల్లో 42 డిగ్రీలు నమోదు
(ఏలూరు సిటీ – ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఉష్ణోగ్రతల తీవ్రత మళ్లీ పెరుగు తోంది. రోహిణి కార్తె ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. కృత్తిక కార్తెలో నమోదైనట్టు తారాస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాక పోయినా ఎండ తీవ్రత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. గురువారం జిల్లాలో భరించలేని వేడిగాలులు వీచాయి. ఉదయం 8గంటల నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత కనిపించింది. ఉక్కపోతను భరించలేక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గుర య్యారు. రహదారులు మధ్యాహ్నం సమయంలో నిర్మానుష్యంగా మారాయి. చింతలపూడి, ఆగిరిపల్లి మండలాల్లో 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు అయింది. జూన్ 5న జిల్లా లోని వేలేరుపాడులో తీవ్రకరమైన వేడిగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీచేసింది.
జిల్లాలో విభిన్న వాతావరణం
జిల్లాలో నాలుగు రోజులుగా విభిన్న వాతావరణం నెలకొంది. పగటి పూట తీవ్రంగా వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవు తున్నా సాయంత్రం సమయంలో కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు, పిడుగులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడుతున్నా, చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకూలడం వల్ల విద్యుత్ అంతరాయాలు ఏర్పడి ఉక్కబోతను భరించలేక అవస్థలు పడుతున్నారు. ఇటువంటి వాతావరణం ఎప్పుడూ చూడలేదని, రోహిణి కార్తె ప్రారంభమైన తర్వాత ఏ మాత్రం వర్షం కురిసినా వాతావరణం పూర్తిగా చల్లబడిపోయేదని, ఇప్పుడు వాతావరణంలో ఆ పరిస్థితులు కనిపించడం లేదని పలువురు చెబుతున్నారు.
రహదారులు నిర్మానుష్యం
ముదినేపల్లి/కైకలూరు/కలిదిండి: ముదినే పల్లి, కైకలూరు, కలిదిండి మండలాల్లో ఉద యం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. తీవ్రమైన వడగాడ్పులు వీచాయి. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. వ్యాపార సంస్థలను ఉదయం 11 గంటలకే మూసివేశారు. కైకలూ రులో సాయంత్రానికి వాతావరణం మేఘావృ తమై ఈదురు గాలులు వీయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వేడిగాలులకు తోడు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఆక్వా చెరువుల్లో నీరు వేడెక్కి ఆక్సిజన్ లోపించి చేపలు, రొయ్యలు నీటిపై తేలాడుతూ మృత్యు వాత పడ్డాయి.