Share News

భీమవరంలో తెల్లకాగితం యూనిట్‌ సందడి

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:22 AM

‘తెల్ల కాగితం’ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుందని మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థాన ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్‌, చైర్మన్‌ బోండాడ నాగ భూషణం అన్నారు.

భీమవరంలో తెల్లకాగితం యూనిట్‌ సందడి
మాట్లాడుతున్న తెల్లకాగితం యూనిట్‌ సభ్యులు

భీమవరం టౌన్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : ‘తెల్ల కాగితం’ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుందని మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థాన ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్‌, చైర్మన్‌ బోండాడ నాగ భూషణం అన్నారు. మంగళవారం భీమవరం మావుళ్ళమ్మను ఈ చిత్ర హీరో రోషన్‌, హీరోయిన్‌ నక్షత్ర, డైరెక్టర్‌ రమేష్‌ దర్శించు కున్నారు. ఆలయ కళా వేదికపై అరసవల్లి చారిట బుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో వారికి అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ట్రస్టు సభ్యులు, చారిటబుల్‌ ట్రస్టు అధ్యక్షుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భీమవరానికి చెందిన రమేష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకోవడం మన భీమవరానికే గర్వకా రమని అన్నారు. మరెన్నో చిత్రాలు చేసి పెద్ద దర్శకుడిగా ఎదగాలని కోరుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా హీరో రోషన్‌, హీ రోయిన్‌ నక్షత్ర, డైరెక్టర్‌ రమేష్‌ మాట్లాడుతూ భీమవరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పదిహేను రోజులపాటు షూటింగ్‌ చేశా మన్నారు. అనంతరం వారిని సత్కరించారు. భీమవరం పద్మాలయ థియేటర్‌లో యూనిట్‌ సభ్యులు సందడి చేశారు. చెరుకువాడ రంగసాయి, ఆలయ పాలకవర్గ సభ్యులు, చిత్ర యూనిట్‌ సభ్యులు, థియేటర్‌ యాజమాన్యం పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 12:22 AM