Share News

గుబ్బల మంగమ్మ ఆలయానికి తెలంగాణ టోల్‌ గేట్‌

ABN , Publish Date - May 13 , 2026 | 12:25 AM

గుబ్బల మంగమ్మ ఆలయ సమీపంలో తెలంగాణ అటవీశాఖ అధికారులు ఏర్పాటుచేసిన టోల్‌గేట్‌ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తొలగించారు.

గుబ్బల మంగమ్మ ఆలయానికి తెలంగాణ టోల్‌ గేట్‌
టోల్‌గేట్‌ తొలగించి పక్కన ఉంచిన సామగ్రి

తొలగించిన గిరిజనులు, ఆలయ కమిటీ సభ్యులు

అధికారులకు ఫిర్యాదు

గతంలో సర్వే చేసిన అధికారులు

బుట్టాయగూడెం, మే 12(ఆంధ్రజ్యోతి): గుబ్బల మంగమ్మ ఆలయ సమీపంలో తెలంగాణ అటవీశాఖ అధికారులు ఏర్పాటుచేసిన టోల్‌గేట్‌ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తొలగించారు. కోర్సవారిగూడెం పంచాయ తీలోని ఆరు గ్రామాల గిరిజనులు మంగళవారం టోల్‌ గేట్‌ సామగ్రి తీసి పక్కన పెట్టారు. అమ్మవారి దర్శనాలకు వస్తున్న భక్తుల ఇబ్బందులపై అటవీ అధికారికి వినతిపత్రం అందజేశారు. భక్తుల నుంచి ఎటువంటి టోల్‌ ఫీజు వసూలు చేయవద్దన్నారు. అమ్మవారి ఆలయం రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉందన్న కారణంతో గతంలో కూడా తెలంగాణ అటవీ అధికారులు టోల్‌ గేట్‌ను ఏర్పాటు చేయగా స్థానిక గిరిజనులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇరు రాష్ట్రాల అటవీ అధికారులు అటవీ ప్రాంతాన్ని పరిశీలించి అమ్మవారి ఆలయం మన రాష్ట్ర పరిధిలో ఉన్నట్లు గుర్తించి టోల్‌ గేట్‌ తొలగించారు. చాలాకాలం తర్వాత మళ్లీ టోల్‌ గేట్‌ ఏర్పాటు చేయడంతో స్థానిక గిరిజనులు తొలగించారు. ఇక్కడి గిరిజనుల అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని తెలంగాణ అటవీ అధికారి సంపత్‌ గిరిజనులకు తెలియజేశారు.

Updated Date - May 13 , 2026 | 12:25 AM