Share News

లెక్క తేలింది..!

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:55 PM

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని 48 మండలాల ఉపాధ్యాయులను మూడుగా విభజించ బడిన కొత్త జిల్లాలకు కేటాయించే విషయమై ఆదివారం స్పష్టత వచ్చింది.

లెక్క తేలింది..!

ప్రస్తుతానికి పోస్టుల విభజనే.. కొత్త జిల్లాల్లోనే టీచర్లకు సాధారణ బదిలీలు

పశ్చిమగోదావరికి 44.9.. ఏలూరు జిల్లాకు 39.77, తూర్పు గోదావరికి 15.33 శాతం టీచరు పోస్టులు

ఉమ్మడి కృష్ణా నుంచి ఏలూరు జిల్లా విద్యాశాఖకు 17.87 శాతం పోస్టుల బదలాయింపు

ఏలూరు అర్బన్‌, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని 48 మండలాల ఉపాధ్యాయులను మూడుగా విభజించ బడిన కొత్త జిల్లాలకు కేటాయించే విషయమై ఆదివారం స్పష్టత వచ్చింది. గతంలో పదోన్నతిని వదులుకున్న ఉమ్మడి జిల్లాలోని మొత్తం 38 మంది (ఏలూరు జిల్లాలో 22 మంది, పశ్చిమగోదావరిలో 16)రివర్షన్‌ టీచర్లకు ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి మొత్తం సర్వీసు/సీనియార్టీని లెక్కించి, వారిని కూడా సాధారణ సీనియార్టీ జాబితాలో చేర్చి, ఆ మేరకు సవరించిన జాబితాలను టీచర్ల పరిశీలన నిమిత్తం జిల్లా వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని పాఠ శాల విద్య అదనపు డైరెక్టర్‌ సుబ్బారెడ్డి అన్ని జిల్లా ల డీఈవోలు, ఆర్జేడీలతో నిర్వహించిన వెబెక్స్‌లో ఆదేశించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న 12,132 మంది ఉపాధ్యాయుల సీని యార్టీ లిస్టులను వెబ్‌సైట్‌లో పెట్టడానికి జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. జాబితాలపై ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరించి పరిష్కరించాలని, ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయం మేరకు తుది సీనియార్టీ జాబితాలను ఖరారు చేయాలని సూచించారు.

కొత్త జిల్లాల ప్రకారమే టీచర్ల బదిలీలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మొత్తం శాంక్షన్డ్‌ పోస్టులు, వర్కింగ్‌ టీచర్లను కొత్త జిల్లాలకు విభజన, కేటాయింపులపై ఒకింత స్పష్టత వచ్చింది. ఆ ప్రకారం మొత్తం వందశాతం పోస్టుల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు 44.9 శాతం, ఏలూరు జిల్లాకు 39.77, తూర్పుగోదావరి జిల్లాకు 15.33 శాతం పోస్టులను కేటాయించే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లాలోకి విలీనమైన ఎనిమిది మండలాల నుంచి 17.87 శాతం టీచరు పోస్టులు ఏలూరు జిల్లా విద్యాశాఖకు బదలాయిస్తారు. ఈ విభజన/నిష్పత్తి గణాంకాలపై అధికారిక ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉంది. కాగా ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లాల పరిధికి లోబడి పోస్టుల విభజన మాత్రమే జరుగుతుంది. ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వం నిర్ణయించిన నిష్పత్తి ప్రకారం జూనియర్‌, సీనియర్‌ ఉపాధ్యాయులను సంబంధిత కేడర్లకు కేటాయిస్తారు. ఆ మేరకు ఖరారైన ఉపాధ్యాయులకు కొత్త జిల్లాల్లో భవిష్యత్తులో బదిలీల కౌన్సెలింగ్‌ ఉంటుందని జిల్లా విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే విభజన

ఉమ్మడి జిల్లాలో 48 మండలాలకు శాంక్షన్డ్‌ పోస్టులు, వర్కింగ్‌ పోస్టులను పరిగణనలోకి తీసు కుని ప్రభుత్వం విడుదలచేయనున్న మార్గదర్శకాల మేరకు టీచర్లను ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు కేటాయిస్తారు. ఈ క్రమంలో తుది సీనియార్టీ జాబితాప్రకారం ఉపాధ్యాయల నుంచి అభీష్టాలను స్వీకరిస్తారు. అభ్యంతరాల పరి ష్కారం తర్వాత తుదిగా కేటాయింపులతో ఉమ్మడి జిల్లా 48 మండలాల పరిధిలో టీచర్ల విభజన, కేటాయింపులు పూర్తవుతాయి. ఈ ప్రక్రియంతా ఈ నెలాఖరు లోగా ముగించాలని విద్యాశాఖ భావి స్తోంది. కాగా మిగతాశాఖల్లో ఉద్యోగుల విభజనకు జనాభా సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటారా లేక విద్యాశాఖ ఇప్పటివరకు అనుసరిస్తున్న విద్యా ర్థుల సంఖ్య : ఉపాధ్యాయుడు నిష్పత్తిన లెక్క గడతారా అనేది ఇంకా తేలలేదు.

Updated Date - Oct 04 , 2026 | 11:55 PM