ఉమ్మడి పశ్చిమ డీఎస్సీలో టీచర్ పోస్టులు 215
ABN , Publish Date - Mar 20 , 2026 | 01:03 AM
వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 పోస్టుల భర్తీకి గురువారం జాబ్ క్యాలెండరును రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాల విద్యా శాఖలో 215 ఉద్యోగ నియామకాలు జరుగవచ్చునని ప్రాథమిక అంచ నా.
విద్యా శాఖ అంచనా.. రేషనలైజేషన్ తర్వాత మరింత స్పష్టత
ఏలూరు అర్బన్, మార్చి 19(ఆంధ్రజ్యోతి): వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 పోస్టుల భర్తీకి గురువారం జాబ్ క్యాలెండరును రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాల విద్యా శాఖలో 215 ఉద్యోగ నియామకాలు జరుగవచ్చునని ప్రాథమిక అంచ నా. ప్రభుత్వం అక్టోబరులో విడుదల చేసే డీఎస్సీ నోటిఫికేషన్‌లో జిల్లాల వారీగా ప్రకటించే ఉపాధ్యాయ ఖాళీల సంఖ్యలో ఉమ్మడి జిల్లాకు కేటాయించే పోస్టుల్లో కొద్దిపాటి మార్పులు ఉం డవచ్చు. కేటగిరీ, సబ్జెక్టుల వారీ వెకెన్సీల వివ రాలు నోటిఫికేషన్‌లోనే స్పష్టత వస్తాయి. కేంద్ర ప్రభుత్వం యు–డైస్ డేటా ప్రకారం గత ఏడాది రాష్ట్రానికి మంజూరుచేసిన 700 స్పెషల్ ఎడ్యుకే షన్(దివ్యాంగులకు బోధించే ప్రత్యేక విద్య/ విలీన విద్య) పోస్టుల్లో ఉమ్మడి జిల్లాకు కేటా యించిన 38 ఖాళీలతోపాటు, మెగా డీఎస్సీ– 2025లో ఆయా రిజర్వ్‌డ్ కేటగిరీల్లో అర్హులైన అ భ్యర్థులు లేకపోవడంతో భర్తీ కాకుండా మిగిలిన 11 బ్యాక్‌లాగ్ పోస్టులు, గత జూన్ 1 నుంచి ఈ ఏడాది అక్టోబరు లేదా నవంబరు వరకు ఏర్పడే రిటైర్మెంట్ వెకెన్సీలను కలుపుకుని జాబ్ క్యాలెం డరులో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగు ణంగా డీఎస్సీ–2026 నోటిఫికేషన్‌లో 215 ఉద్యో గాలను భర్తీ చేసే అవకాశం ఉంది.
రేషనలైజేషన్ తర్వాతే స్పష్టత
ఉమ్మడి జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో 16,700 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఓ వైపు విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గిపోతుండగా, కొన్ని చోట్ల కొరతవున్న పాఠశాలలకు టీచర్లను సర్దు బాటు చేసేందుకు ప్రభుత్వం హేతుబద్దీకరణ, వర్క్ అడ్జస్ట్‌మెంట్‌లతో నెట్టుకొస్తోంది. ఉపాధ్యా యుడు : విద్యార్థుల నిష్పత్తి తీసుకోవడానికి కటాఫ్ తేదీని ప్రకటించి త్వరలో రేషనలైజేష న్‌ను చేపట్టనుంది. ఇది పూర్తయిన తర్వాత సబ్జె క్టులు, కేడర్ల వారీగా మిగులు పోస్టులు, కొరత పోస్టుల సంఖ్యపై స్పష్టత వస్తుంది. ఇది పూర్త యిన తర్వాత టీచరు పోస్టులు అవసరమను కుంటే ఆ మేరకు మొత్తం గుర్తించిన పోస్టుల్లో 70 శాతం పోస్టులు ఇన్‌సర్వీసు టీచర్లకు పదోన్నతులు ఇవ్వడానికి, మిగిలిన 30 శాతం పోస్టులు కొత్త డీఎస్సీకి నోటిఫై చేస్తారు. దీనికి అనుగుణంగా జాబ్ క్యాలండరులో కొత్తగా టీచరు పోస్టుల వివరాలు తెలుస్తాయి.