ఓహ్.. ఓపీఎస్!
ABN , Publish Date - May 30 , 2026 | 12:40 AM
టీచర్ల చిరకాల డిమాండ్‌గా వున్న పాత పెన్షన్ స్కీం(ఓపీఎస్)ను అమలుచేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
డీఎస్సీ–2002, 2003 ఉపాధ్యాయులకు
పాత పెన్షన్ విదానం వర్తింపునకు కసరత్తు
ఉమ్మడి జిల్లాలో 528 మంది టీచర్లకు ప్రయోజనం
ఏలూరు అర్బన్, మే 29 (ఆంధ్రజ్యోతి): టీచర్ల చిరకాల డిమాండ్‌గా వున్న పాత పెన్షన్ స్కీం(ఓపీఎస్)ను అమలుచేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డీఎస్సీ–2002, 2003 రిక్రూట్‌మెంట్లలో నియమితులైన ఉపాధ్యాయులందరికీ ఇప్పటి వరకు అమల్లోవున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)స్థానే ఓపీఎస్‌ను వర్తింపజే యడానికి కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం తుదిదశలోవున్న ఈ ప్రతిపాదనపై త్వరలోనే ప్రభుత్వం ఆమోదముద్ర వేయనున్నట్టు సంకేతాలు వస్తున్నాయు. ఇది కార్యరూపం దాల్చితే ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాలో మొత్తం 528మంది టీచర్లకు ఓపీఎస్ వర్తింపజేస్తారు. ఇలా ఓపీఎస్ ప్రయోజనం పొందేవారిలో ఎస్జీటీలు 360 మంది, స్కూల్ అసిస్టెంట్లు 168మంది ఉంటారు. కేంద్ర ప్రభుత్వం 2020, 2023లలో జారీచేసిన మెమో ఉత్తర్వులు 57, సూచనల ప్రకారం సీపీఎస్ అమలైన 2004 సెప్టెంబరు ఒకటోతేదీకి ముందు ఉద్యోగ నోటిఫికేషన్ జారీఅయ్యి, పరీక్షలు, ఫలితాలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయినవారందరికీ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయా ల్సి ఉంది. కాగా రాష్ట్రంలో డీఎస్సీ–2003లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నవంబరులో జారీకాగా, రాతపరీక్ష 2004 ఏప్రిల్‌లో జరిగింది. ఫలితాలు అదే ఏడాది జూన్ 11న ప్రకటించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం అర్హులైన అభ్యర్థులను ప్రకటించి ఉద్యోగనియా మకాల ప్రక్రియ పూర్తయ్యేనాటికి 2005 ఏప్రిల్ వచ్చింది. ఈ డీఎస్సీలో ఉమ్మడిజిల్లాలో మొత్తం 528మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు. ఉద్యోగాల్లోచేరేనాటికి 2005వ సంవత్సరం వచ్చిందన్న సాకుతో వీరం దరికీ సీపీఎస్‌ను వర్తింపజేశారు. ఇలా తమను ఓపీఎస్‌ను తప్పించడం అన్యాయమంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అభ్యర్థులు ఏళ్లతరబడి నిరసనలు, ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ప్రభు త్వం సీపీఎస్ స్థానే ఓపీఎస్‌ను వర్తింపజేస్తామని పలు సందర్భాల్లో హామీలైతే ఇచ్చిందికాని కార్యాచరణ శూన్యం. గత ప్రభుత్వం డీఎస్సీ– 2003 ఉపాధ్యాయులకు ఓపీఎస్ ఇవ్వకుండా మోసంచేసినా కూటమి ప్రభుత్వంమాత్రం కేంద్రప్రభుత్వ మెమోను అమలుచేయడానికే మొగ్గుజూపింది. సీపీఎస్ అమలు తేదీకంటే ముందుగానే విడుదలైన నోటిఫికేషన్లద్వారా నియామకాలు జరిగినందున డీఎస్సీ–2003 టీచర్లకు పాతపెన్షన్ విధానాన్ని వర్తింప జేయనున్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్త ంగా సుమారు 11వేల మంది టీచర్లకు ఓపీఎస్‌ను వర్తింపజేయడానికి మార్గం సుగమమైంది. దీనిపై ప్రభుత్వ తుదినిర్ణయం, ఉత్తర్వులు వెలువడాల్సిఉంది. కాగా ఎంపికల ప్రక్రియ పూర్తయినప్పటికీ కోర్టు వివాదాలవల్ల నియామకాలు ఆలస్యమైన డీఎస్సీ–2002 ఉపాధ్యా యులకు కూడా ఓపీఎస్‌ను వర్తింపజేస్తారు.