Share News

కొత్త జిల్లాలకు టీచర్ల విభజన తరలింపు వేగవంతం

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:39 AM

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిలా ్లనుంచి విభజిత కొత్త జిల్లాలకు ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన, కేటాయింపులను డిసెంబరు నుంచే అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయిం చింది.

కొత్త జిల్లాలకు టీచర్ల విభజన తరలింపు వేగవంతం

డిసెంబరులో ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్లు.. ఏప్రిల్‌ 23న కొత్తస్థానాల్లో చేరిక

పశ్చిమ గోదావరికి 5,895, ఏలూరుకు 4,937, తూర్పు గోదావరికి 2,226 మంజూరు పోస్టులు

ఏలూరుఅర్బన్‌,నవంబరు27(ఆంధ్రజ్యోతి):ఉమ్మడి పశ్చిమ గోదావరి జిలా ్లనుంచి విభజిత కొత్త జిల్లాలకు ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన, కేటాయింపులను డిసెంబరు నుంచే అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందిని నిర్ధేశిత ఫార్మూలా ప్రకారం కొత్త జిల్లాలకు కేటాయింపులు ఇప్పటికే పూర్తిచేశారు. సాధారణ పరిపాలనాశాఖ (జీఏడీ)నుంచి తుది నిర్ణయం వెలువడిన వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయులను కొత్తజిల్లాలకు అధికారికంగా విభజన చేశారు. డిసెంబరు మొదటి వారంలోనే ఈ విభజనను అమల్లోకి తెస్తారని సంకేతాలు వస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖలో మొత్తం 13,058 ఉపాధ్యాయ పోస్టులు మంజూరు (శాంక్షన్డ్‌ పోస్టులు) కాగా, వీటిలో ప్రస్తుతం 11,492 పోస్టుల్లో టీచర్లు ఉన్నారు. ఈ పోస్టులను ఉమ్మడి జిల్లా నుంచి కొత్తజిల్లాలుగా ఆవిర్భవించిన ఏలూరు జిల్లాకు 4,937 శాంక్షన్డ్‌ పోస్టుల్లో 4,405 వర్కింగ్‌ పోస్టులను, భీమవరం కేంద్రంగావున్న కొత్త పశ్చిమ గోదావరి జిల్లాకు 5,895 శాంక్షన్డ్‌ పోస్టులకుగాను 5,121 వర్కింగ్‌ పోస్టులను, తూర్పుగోదావరి జిల్లాలోకి విలీనమైన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మండలాలకు చెందిన 2,226 శాంక్షన్డ్‌ పోస్టుల్లో 1,966 వర్కింగ్‌ పోస్టులను అధికారికంగా విభజన, కేటాయింపులు చేశారు. వీటిలో స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, మోడల్‌ప్రైమరీ స్కూల్స్‌ హెచ్‌ఎంలు, మ్యూజిక్‌ టీచర్లు, ఆర్ట్‌ టీచర్లు, క్రాఫ్ట్‌ టీచర్లు, లాంగ్వేజ్‌ పండిట్లు, ఒకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్లు, ఇతర బోధనా పోస్టులున్నాయి. ఇక ఉమ్మడి జిల్లా విద్యాశాఖకు చెందిన కార్యాలయ సిబ్బంది నుంచి ఏలూరు జిల్లా డీఈవో కార్యాలయానికి 31మంది, కొత్త పశ్చిమ గోదావరి జిల్లాకు 25 మందిని కేటాయించారు. బోదనేతర సిబ్బందిలో ఏలూరుకు నలుగురు. పశ్చిమ గోదావరికి ఇద్దరిని కేటాయించారు.

అమలుకు మూడంచెల కమిటీ ఏర్పాటు

జిల్లా కేడర్‌ పోస్టుల కేటాయింపునకు మూడు అంచెల కమిటీ(డీఎల్‌సీ)ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ కమిటీకి ఉమ్మడిజిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కో–చైర్మన్‌గా కొత్త జిల్లాల కలెక్టర్లు, మెంబర్‌ కన్వీనర్‌గా ఉమ్మడి జిల్లా డీఈవో, కో–కన్వీనర్లుగా కొత్తజిల్లాల డీఈవోలు, సభ్యులుగా ఉమ్మడి, కొత్తజిల్లాల డీఆర్వోలు వ్యవహరిస్తారు. ఈ కమిటీతో ఉమ్మడి జిల్లా డీఈవో సమన్వయం చేసుకుని జిల్లా కేడర్లకు ఉపాధ్యాయుల కేటాయింపును పూర్తిచేయాల్సి ఉంటుంది.

కొత్త స్థానాల్లో ఏప్రిల్‌ 23న చేరిక

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే కొత్త జిల్లాలకు ఉ ద్యోగులు, ఉపాఽధ్యా యుల తరలింపు ఉంటుందని భావి స్తున్నారు. జిల్లా లను ఎంపిక చేసు కునేందుకు టీచర్ల నుంచి ఆప్షన్లను తొలుత స్వీకరి స్తారు. అయితే సీనియార్టీ ప్రాతిపదికనే కేటాయింపులు జరుగుతాయి. కొత్త జిల్లాలకు డిసెం బరులో కేటాయింపులు, తరలింపులు పూర్తయినా బోధనకు విఘాతం కలుగ కుండా ఉండేందుకు ఏప్రిల్‌ 22 వరకు ప్రస్తుత పాత స్థానా ల్లోనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి చివరి పనిదినమైన వచ్చే ఏడాది ఏప్రిల్‌ 23న కొత్త స్థానాల్లో ఉపాధ్యాయులు విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఆయా ప్రాధాన్యత కేటగిరీలకు వెసులుబాటు ఉంటుంది.

ఉమ్మడి జిల్లా టీచర్‌ పోస్టుల విభజన ఇలా

పోస్టు పేరు పాత జిల్లా ఏలూరు కొత్త పశ్చిమ

ఎస్‌ఏ– బీఎస్‌ 790 280 366

ఇంగ్లీష్‌ 897 315 422

హిందీ 680 230 321

గణితం 985 345 458

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ 552 189 250

ఫిజికల్‌ సైన్స్‌ 772 267 360

సోషల్‌ స్టడీస్‌ 848 293 396

తెలుగు 844 296 395

ఎస్జీటీ–తెలుగు 5440 2218 2401

Updated Date - Nov 28 , 2026 | 12:39 AM