పశ్చిమకే టీచరు పోస్టులు ఎక్కువ
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:40 AM
ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయ పోస్టులను కొత్త జిల్లాలకు అనుగుణంగా విభజనపై బుధవారం స్పష్టతవచ్చింది. అమరావతిలో మంగళ, బుధ వారాల్లో పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన సమా వేశంలో ఉమ్మడిజిల్లాలోని టీచర్ల శాంక్షన్డ్ పోస్టు లను కొత్త జిల్లాలకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కేటాయించారు.
ఏలూరుకు 4,958, పశ్చిమకు 5,955, తూర్పునకు 2,232 పోస్టులు
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కొత్త జిల్లాలకు విభజన కేటాయింపు!
ఏలూరు అర్బన్, జూలై 22(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయ పోస్టులను కొత్త జిల్లాలకు అనుగుణంగా విభజనపై బుధవారం స్పష్టతవచ్చింది. అమరావతిలో మంగళ, బుధ వారాల్లో పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన సమా వేశంలో ఉమ్మడిజిల్లాలోని టీచర్ల శాంక్షన్డ్ పోస్టు లను కొత్త జిల్లాలకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కేటాయించారు. స్థానికత, సీనియార్టీ ఆధారంగా ఈ విభజన జరిగింది. ఆ ప్రకారం ఏలూరు జిల్లాకు ప్రభుత్వ యాజమాన్యంలో హెచ్‌ఎం పోస్టులు మొదలుకుని ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ కేడర్, ఒకేషనల్, ఆర్ట్స్, మ్యూజిక్, క్రాఫ్ట్, తదితర కేడర్లలో 150పోస్టులు, ఎంపీపీ/ జడ్పీ యాజమాన్యంలో 4341 పోస్టులు, కార్పొ రేషన్ యాజమాన్యంలో 467 పోస్టులు కలిపి 4958 కేటాయించారు.పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రభుత్వ యాజమాన్యంలో 107,ఎంపీపీ/ జడ్పీ లో 4869, మున్సిపల్ యాజమాన్యంలో 979 పోస్టులు కలిపి 5,955 కేటాయించారు. తూర్పు గోదావరి జిల్లాకు 2,232 పోస్టులను కేటాయిం చారు. ఆ ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మొత్తం 13,145 శాంక్షన్డ్ టీచరు పోస్టులను మార్గదర్శకాల మేరకు గవర్నమెంట్ యాజమాన్యానికి 316, ఎంపీపీ/జడ్పీకి 11,272, మున్సిపల్ 1090, కార్పొరేషన్ యాజమాన్య పాఠశాలలకు 467 పోస్టులుగా నిర్ధారించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా నుంచి మూడు జిల్లాలుగా విడిపోయిన/విలీనమైన ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నారు. కాగా పోస్టుల విభజనపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. తుదిగా ఖరారు చేసే నాటికి పోస్టుల విభజనలో కొద్దిపాటి మార్పులు మినహా దాదాపు విభజన ఇలాగే ఉంటుంది.