Share News

అభ్యంతరకర ప్రవర్తన.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

ABN , Publish Date - Sep 13 , 2026 | 12:52 AM

ఇంటర్మీడియట్‌ విద్యారి ్థనులపట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న నిడమర్రు జడ్పీ హైస్కూలు ప్లస్‌ గణితం ఉపాధ్యాయుడు ఐ.వి.ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌ను డీఈవో వెంకట లక్ష్మమ్మ సస్పెండ్‌ చేశారు.

అభ్యంతరకర ప్రవర్తన.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

ఏలూరు అర్బన్‌, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ విద్యారి ్థనులపట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న నిడమర్రు జడ్పీ హైస్కూలు ప్లస్‌ గణితం ఉపాధ్యాయుడు ఐ.వి.ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌ను డీఈవో వెంకట లక్ష్మమ్మ సస్పెండ్‌ చేశారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలపడంలో జాప్యం చేసారన్న అభియోగంపై ప్రధానోపాధ్యాయుడు కె.శేఖర్‌బాబుకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ప్రసాద్‌ తమపట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారని బాలికలు ఈనెల 10న స్కూలు హెచ్‌ఎంకు ఫిర్యాదుచేశారు. ఈ విషయాన్ని వెంటనే విద్యాధికారులకు తెలపకుండా తాత్సారం చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక ప్రజా ప్రతినిధి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ద్వారా విషయం తెలుసుకున్న డీఈవో విచారణకు డీవైఈవో, ఎంఈవోలను పంపా రు. విచారణలో బాలికలపట్ల ఉపాధ్యాయుడి అభ్యంతరకర ప్రవర్తనను నిర్ధారించుకున్నారు. వీరి నివేదిక ఆధారంగా టీచర్‌ ప్రసాద్‌ను సస్పెండ్‌ చేసి, హెచ్‌ఎంకు నోటీసు ఇచ్చారు.

Updated Date - Sep 13 , 2026 | 12:52 AM