విద్యార్థినులతో అనుచిత ప్రవర్తన
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:53 AM
మండ ల పరిధిలోని బంజరగూడెం మండల పరిషత్ యూపీఎస్ పాఠశాలలో ఎస్‌జీటీగా పని చేస్తున్న డి.రామ్‌ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
బంజరగూడెం ఉపాధ్యాయుడి సస్పెన్షన్
కుక్కునూరు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): మండ ల పరిధిలోని బంజరగూడెం మండల పరిషత్ యూపీఎస్ పాఠశాలలో ఎస్‌జీటీగా పని చేస్తున్న డి.రామ్‌ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులను చెప్పుతో కొట్టడం, బాలి కల పట్ల అనుచిత ప్రవర్తనపై విద్యార్థుల తల్లిదం డ్రులు స్కూల్ కమిటీ సభ్యులు ఇటీవల కుక్కునూ రు పోలీస్ స్టేషన్‌లో, ఎంఈవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.దీనిపై కుక్కునూరు ఎంఈవో ధన లక్ష్మి పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. విచారణ సమయంలోను ఆ ఉపాధ్యాయుడు ఎంఈవోను సైతం ‘మీకు రూల్స్ తెలుసా’ అంటూ ప్రశ్నించడం గమనార్హం. విద్యార్థుల పట్ల అభ్యంతరమైన భాష ఉపయోగించడం, తదితర అంశాలన్ని ఎంఈవో దృష్టికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీసు కొచ్చారు. ఈ మేరకు నివేదికను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించగా ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.