Share News

ప్రజా బాట..

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:11 AM

కూటమి రెండేళ్ల పాలనలో ప్రజలకు జరిగిన మేలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్లేందుకు టీడీపీ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. ఈనెల 27 నుంచి 45 రోజుల పాటు ఇంటింటా వెళ్లి పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం కల్పించనున్నారు.

ప్రజా బాట..

27 నుంచి ఇంటింటా టీడీపీకి సమాయత్తం

అటు విధ్వంసం... ఇటు అభివృద్ధి జాడపై విశ్లేషణ

నియోజకవర్గాల వారీగా కరపత్రాలు సిద్ధం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

కూటమి రెండేళ్ల పాలనలో ప్రజలకు జరిగిన మేలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్లేందుకు టీడీపీ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. ఈనెల 27 నుంచి 45 రోజుల పాటు ఇంటింటా వెళ్లి పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం కల్పించనున్నారు. వాస్తవంగా జూన్‌లోనే రెండో ఏడాది పాలన పూర్తయినప్పటికీ ప్రజల్లోకి వెళ్లాలని తలపోశారు. ఈ నేపథ్యంలో ఓటర్ల సమగ్ర జాబితా సవరణ (సర్‌) కార్యక్రమం నిర్వహణ జరుగుతుండడంతో పార్టీ అధిష్ఠానం వెనక్కి తగ్గింది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో పార్టీ కేడర్‌ నుంచి క్లసర్టు ఇన్‌చార్జిలు వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఓటర్లలో అవగాహన పరిచి వారిని చైతన్యవంతులను చేసి, వారితో దరఖాస్తు చేయించారు. ఇది సక్సెస్‌ అయ్యింది. సర్‌ కార్యక్రమం ఈనెల 24తో ముగిస్తున్న తరుణంలో ఈనెల 27 నుంచి జోష్‌గా ఇంటింటా టీడీపీ కార్య క్రమానికి నియోజకవర్గాల వారీగా కరపత్రాలు ద్వారా వివ రించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రాష్ట్ర ప్రజల జీవనాడి అయి న పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యే దశకు రావడంతో ఇదే ప్రధాన అస్త్రంగా ప్రజల్లోకి వివరించేందుకు జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు గొప్ప అవకాశం. ఇటీవల సీఎం చంద్రబాబు సైతం ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వడం ఖాయమని, పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో కనీసం రెండు శాతం పనులు చేసి..అన్ని విధాలా ముందుకు సాగకుండా చేపట్టిన విధ్వంసాలపైన ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చించనున్నారు. మరోవైపు అమరావతిలో రాజధాని నిర్మాణం పురోగతిలో ఉండటంపైన వివరించనున్నారు. జిల్లాలో ఆరక్‌అండ్‌బీ రోడ్లు, తల్లికి వందనం, పల్లెపండుగ కింద గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఎంఎస్‌ఎంఈ పార్కులు, వసతి గృహాల్లో వసతులు కల్పన, టిడ్కో ఇళ్లు కట్టని వారి మొత్తాలు వెనక్కి ఇవ్వడంపైన ప్రజల్లో చర్చ సాగించనున్నారు.

కరపత్రాలు సిద్ధం

జిల్లాలో ఇంటింటా టీడీపీ కార్యక్రమం కింద ప్రతిఇంటిని సందర్శించేలా కార్యక్రమాలను క్లస్టర్‌ ఇన్‌చార్జులు రూపొందించనున్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌, ఎమ్మెల్యే, మాజీ సర్పంచులు, ఎంపీ, ఎమ్మెల్సీలు భాగస్వామ్యంతో ప్రజలతో మమేకం కానున్నారు. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా కరపత్రాలను రాష్ట్ర పార్టీ పంపింది. వీటిని నియోజకవర్వ కన్వీనర్లు స్వీకరించి ప్రతి ఇంటికి పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించనున్నారు.

Updated Date - Jul 19 , 2026 | 12:11 AM