టీడీపీ జిల్లా కార్యాలయానికి లైన్ క్లియర్
ABN , Publish Date - May 01 , 2026 | 01:15 AM
జిల్లా టీడీపీ నూతన కార్యాలయ భవన నిర్మాణా నికి లైన్ క్లియర్ అయ్యింది. కొద్ది నెలల క్రితం జిల్లా కేంద్రంలో రెండు ఎకరాలలోపు స్థలంలో నిర్మించాలని పార్టీ అఽధిష్ఠానం తీర్మానించింది.
1.62 ఎకరాల స్థలం కేటాయింపు ... రాష్ట్ర కేబినెట్ ఆమోదం
ఏలూరు,ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి):జిల్లా టీడీపీ నూతన కార్యాలయ భవన నిర్మాణా నికి లైన్ క్లియర్ అయ్యింది. కొద్ది నెలల క్రితం జిల్లా కేంద్రంలో రెండు ఎకరాలలోపు స్థలంలో నిర్మించాలని పార్టీ అఽధిష్ఠానం తీర్మానించింది. నియోజకవర్గాల్లోను కార్యాలయాల నిర్మాణాలు చేయాలని తలపోశారు. ఈ నేపథ్యంలో ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం సమీపంలో ఎక్సైజ్ శాఖ గొడౌన్ వద్ద ప్రభుత్వ భూమి టీఎస్ నెంబర్ 660/3లో 1.62 ఎకరాలను 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన జిల్లా పార్టీ కార్యాలయానికి కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ గురువారం ఆమోదముద్ర వేసింది. ఎకరాకు రూ.వెయ్యి చెల్లించేలా ప్రాతిపదికన ఈ కేటాయింపు జరిగింది. ప్రస్తుతం అమీనాపేటలో ఒకప్పటి దేవదాయశాఖ స్థలంలో అప్పటి మంత్రి దండు శివరామరాజు ఆధ్వర్యంలో నిర్మించిన జిల్లా కార్యాలయం సమావేశాలకు సరిపోవడం లేదు. దీంతో పర్మినెంట్‌గా సుందరమైన జిల్లా కార్యాలయాలు ప్రతి జిల్లాలో ఉండాలన్న పార్టీ అధిష్ఠాన నిర్ణయంతో జిల్లా కార్యాలయానికి లైన్ క్లియర్ అయ్యింది.