Share News

జగన్‌ క్షమాపణలు చెప్పాలి..

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:34 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి భక్తుల మనోభా వాలు దెబ్బతీసిన మాజీ సీఎం వైఎస్‌.జగన్‌ స్వామికి క్షమాపణలు చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఎమ్మెల్యే బడేటి చంటి డిమాండ్‌ చేశారు.

జగన్‌ క్షమాపణలు చెప్పాలి..
వేంకటేశ్వరస్వామి గుడి వద్ద నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు

లడ్డూ ప్రసాదం అపవిత్రంపై ‘మహాపాపం నిజం’ పేరిట టీడీపీ ఆలయ సంప్రోక్షణ

ఏలూరు టూటౌన్‌, జనవరి 29 (ఆంధ్ర జ్యోతి): తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి భక్తుల మనోభా వాలు దెబ్బతీసిన మాజీ సీఎం వైఎస్‌.జగన్‌ స్వామికి క్షమాపణలు చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఎమ్మెల్యే బడేటి చంటి డిమాండ్‌ చేశారు. ఆర్‌ఆర్‌.పేట వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కూటమి నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ స్వామి ప్రసాదం అప విత్రం చేసిన వైసీపీ నాయకులకు ప్రజలను ఓటు అడిగే నైతికహక్కు లేదన్నారు. కుల మతాల మధ్య చిచ్చుపెట్టిన వైసీపీ జగన్‌కు సీబీఐ ఇచ్చిన నివేదిక చెంపపెట్టులాంటిద న్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి భారీ ప్రదర్శనగా వేంకటేశ్వరస్వామి దేవస్థానా న్ని చేరుకుని ‘మహాపాపం నిజం’ పేరిట ఆలయ సంప్రోక్షణ చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌ కిశోర్‌, మాలల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దాసరి ఆంజనేయులు, ఇడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, డిప్యూ టీ మేయర్‌ కర్రి శ్రీనివాసరావు, దేవస్థానం చై ర్మన్‌ వెంకట రమాదేవి, ధర్మకర్తలు ఈతకోటి శ్రీనివాసరావు, నెహ్రుబాబు, సీతా రామాం జనేయశర్మ, ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 12:35 AM