Share News

కూటమి ధర్మానికి కట్టుబడాల్సిందే..

ABN , Publish Date - Oct 17 , 2026 | 01:14 AM

ఏలూరు నగర పాలక సంస్థ మేయర్‌ సీటును జనసేనకు కేటాయించడంతో టీడీపీ కేడర్‌లో అసంతృప్తి నెలకొంది.

 కూటమి ధర్మానికి కట్టుబడాల్సిందే..
పార్టీ శ్రేణులను సముదాయిస్తున్న అనురాధ,చంటి

ఏలూరు టూటౌన్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఏలూరు నగర పాలక సంస్థ మేయర్‌ సీటును జనసేనకు కేటాయించడంతో టీడీపీ కేడర్‌లో అసంతృప్తి నెలకొంది. టీడీపీ నగర కార్యవర్గం, డివిజన్‌ ఇన్‌ఛార్జ్‌లు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌లు మేయర్‌ సీటును టీడీపీకి కేటా యించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని పార్టీ అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చారు. దీంతో వారిని సముదాయిం చేందుకు పార్టీ అధిష్ఠానం జిల్లా పార్టీ పరిశీలకురాలు కంచుమర్తి అనురాధను, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పంపించారు. వీరిద్దరూ ఎమ్మెల్యే బడేటి క్యాంపు కార్యాలయానికి శుక్రవారం రాగా కార్యకర్తలంతా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అనురాధ, చింతమనేని మాట్లాడుతూ పార్టీ కేడర్‌ సంయమనంతో కూటమి ధర్మాన్ని పాటించాలని హితవు పలికారు. ఎన్నికల్లో కలిసికట్టుగా కూటమి నాయకులు, కార్యకర్తలు మేయర్‌ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ పార్టీ నిర్ణయమే శిరోధారమని, కూటమి పొత్తు ధర్మానికి కట్టుబడి ఉండాలన్నారు. అనంతరం క్లస్టర్‌ ఇన్‌ఛార్జులు, నాయకులు, పోటీలో ఉండే అభ్యర్థులతో జిల్లా పరిశీలకురాలు పంచుమర్తి అనురాధ, ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి చర్చిం చారు. మేయర్‌ సీటు జనసేనకు కేటాయించిన నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ డివిజన్లు టీడీపీ అభ్యర్థులకు, సీనియర్లకు కేటాయించేలా చూస్తామన్నారు. దీంతో జనసేన అడిగిన డివిజన్లు తగ్గించే అవకాశం ఉంది.

Updated Date - Oct 17 , 2026 | 01:15 AM