కూటమి గెలుపే లక్ష్యం
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:42 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కృషి చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చంటి అన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు చంటి
ఏలూరు టూటౌన్/ఏలూరు రూరల్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కృషి చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చంటి అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన టీడీపీ జిల్లా కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల సమన్వయ కమిటీలు తీసుకున్న నిర్ణయా లకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలి. అభ్యర్థి ఏ పార్టీ వారైన మూడుపార్టీల నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా విజయానికి కృషి చేయాల’న్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ 2024 సాధారణ ఎన్నికల్లో సాధించిన విజయాలకన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు. కూటమి రాష్ట్రస్థాయి నాయకులు నిర్ణయాల మేరకే నగర మేయర్, మున్సిపల్ చైర్మన్‌ల ఎన్నిక ఉంటుందన్నారు. కార్య క్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ హాజరయ్యారు. పార్టీ ప్రధాన కార్య దర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, పార్టీ కార్యాలయ కార్య దర్శి ఉప్పాల జగదీశ్‌బాబు, అరుణకుమారి, సుధా కర్, జంపా సూర్యనారాయణ, పూజారి నిరంజన్, ఈడా చైర్మన్ శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ పార్థ సారథి, టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చోడే వెంకటరత్నం, రెడ్డి నాగరాజు, మీడియా కోఅర్డినేటర్ చల్లా వెంకట సత్యవర ప్రసాదరావు పాల్గొన్నారు.
మేయర్ పీఠం జనసేనకే..లేదంటే ఫ్రెండ్లీ పోటీ
ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు
స్థానిక సంస్థల ఎన్నికలలో ఏలూరు నగర మేయర్ పీఠాన్ని జనసేనకు కేటా యించాలని, సీటు ఇవ్వని పక్షంలో ఫ్రెండ్లీ పోటీకి సిద్ధమని ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘కూటమి విజయానికి జనసేన నాయకులు, కార్య కర్తలు చేసిన కృషికి తగిన గౌరవం ఇవ్వాలి. ఎంపీ, ఎమ్మెల్యే, యార్డు చైర్మన్, ఈడా చైర్మన్ పద వులు టీడీపీకి ఉన్నాయి. గతంలో వైసీపీ తరపున గెలిచిన మేయర్‌తో పాటు 30 మంది కార్పొ రేటర్లు టీడీపీతో కలిసి కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమికి న్యాయం జరగాలంటే మేయర్ పదవిని జనసేనకు ఇవ్వాలని పార్టీ శ్రేణులు కోరుతు న్నా యి. మేయర్ సీటు జనసేనకు వస్తే నేను పోటీకి సిద్ధం. పార్టీని వీడి మరో పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవ’మన్నారు. సమావేశంలో నారా వేణు, రాఘవయ్య చౌదరి, శిరి పల్లి శివరామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.