అభివృద్ధి, సంక్షేమంతో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నాం..
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:45 AM
ఎన్డీఎ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల విశ్వాసాన్ని చూరుగొందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తెలిపారు.
ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు
నిడమర్రు జూన్ 28(ఆంధ్రజ్యోతి): ఎన్డీఎ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల విశ్వాసాన్ని చూరుగొందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తెలిపారు. రెండేళ్ల కూటమి పాలన ఉంగుటూరు నియోజకవర్గ స్థాయి విజయోత్సవ సభ ఆదివారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలో నాలుగు మండలాలకు చెందిన కూటమి నాయకులు, కార్య కర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిఽథిగా హజరైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కోటికలపూడి గోవింద రావు మాట్లాడుతూ పీఎం నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ల ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ అభి వృద్ధిలో పరుగులు పెడుతోందన్నారు. మరో ముఖ్య అతిఽథి శరణాల మాలతీరాణి మాట్లాడుతూ పీఎం మోదీ మన రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్నారని, మంచి స్నేహపూరిత వాతావరణంలో రాష్ట్రపాలన సాగుతోందన్నారు. కార్యక్రమం లో కూటమి నాయకులు నిమ్మల దొరబాబు, తోటశ్రీను, పత్తి మదన్, జ్యోతి అయ్యప్ప, రెడ్డి చందు, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.