Share News

స్థానిక ఎన్నికల్లో విజయఢంకా మోగించాలి

ABN , Publish Date - Jun 23 , 2026 | 01:45 AM

స్థానిక సం స్థల ఎన్నికల్లో కూటమి విజయఢంకా మోగించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కోరారు.

 స్థానిక ఎన్నికల్లో విజయఢంకా మోగించాలి
కొయ్యలగూడెం సభలో ఐక్యత చాటుతున్న మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే బాలరాజు, కూటమి నాయకులు

మంత్రి కొలుసు పార్థసారథి

కొయ్యలగూడెంలో విజయోత్సవ సభ

కొయ్యలగూడెం, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి):స్థానిక సం స్థల ఎన్నికల్లో కూటమి విజయఢంకా మోగించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పోలవరం నియోజకవర్గ విజయోత్సవ సభను కొయ్యలగూడెంలో సోమవారం నిర్వహిం చా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాయ కులు, కార్యకర్తలు ఐక్యతతో ముందుకు సాగాలి. గొడ్డలి పార్టీ చేస్తున్న విష ప్రచారాలను తిప్పి కొట్టాలి. అసత్య ప్రచారాలు చేస్తూ కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు చూస్తున్నారు. మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. కూటమి నాయకులంతా అప్రమత్తంగా ఉండాలి. గంజాయి స్మగ్లర్‌లకు సపోర్టు చేస్తూ వారిని వెనకేసు కొస్తున్నా’రన్నారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడు తూ ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని ప్రభుత్వ పఽథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ జిల్లాలో కూటమి ఐక్యతతో ముం దుకు సాగాలన్నారు. మూడు పార్టీల కలయికతో గత ఎన్నికల్లో విజయఢంకా మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని అదేపంథాను స్థానిక సంస్థల ఎన్నికల్లోను చూపించాలని కోరారు. ట్రైకార్‌ చైర్మన్‌ బొరగం శ్రీనివాస్‌ మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలో అభివృద్థే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మూడు పార్టీలు ఐక్యతతో ముందుకు సాగుతామన్నారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, మండల టీడీపీ అధ్యక్షుడు పారేపల్లి రామారావు, బీజేపీ నాయకురాలు బొల్లిన నిర్మల, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్‌, గంగిరెడ్ల మేఘలాదేవి, కొత్త రమ, ఆకుల అరుణ, ఏఎంసీ చైర్మన్‌ పొట్ట రామారావు, మండల బీజేపీ అధ్యక్షుడు గొలిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు. కాగా సభలో జనసేన కేడర్‌ కన్పించలేదు. నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు, మండల అధ్య క్షులు, పట్టణ అధ్య క్షులు ఎవరూ కన్పించలేదు.

Updated Date - Jun 23 , 2026 | 01:45 AM