Share News

మహా జోష్‌

ABN , Publish Date - May 27 , 2026 | 12:28 AM

పసుపు సంబరానికి తెలుగుదేశం శ్రేణులు సర్వం సన్నద్ధం అయ్యాయి.

మహా జోష్‌
ఏలూరులో ఏర్పాటుచేసిన ఎల్‌ఈడీ స్ర్కీన్‌

నేడు, రేపు 73 క్లస్టర్లలో వర్చువల్‌గా తెలుగుదేశం పార్టీ మహానాడు

ఎల్‌ఈడీ స్ర్కీన్ల ఏర్పాటు.. పసుపు జెండాల అలంకరణ పూర్తి

జిల్లా స్థాయి అంశాలపై పలు తీర్మానాలు.. ఎంపీ పుట్టా మహేష్‌ దూరం

పసుపు సంబరానికి తెలుగుదేశం శ్రేణులు సర్వం సన్నద్ధం అయ్యాయి. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా 28న టీడీపీ మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయం వేదికగా ఈనెల 27,28వ తేదీల్లో జరిగే ముఖ్య చర్చలు, సమావేశాలు వర్చువల్‌గా ఆయా జిల్లాల్లో పార్టీ శ్రేణులు భాగస్వామ్యం ఉండేలా కార్యక్రమం ఏర్పాటు చేశారు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ఏలూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 73 క్లస్టర్ల పరిధిలో పార్టీ శ్రేణులు మహానాడు సరంభాన్ని వీక్షించేందుకు ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. అక్కడే పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటలకు అల్పాహారం, భోజనాలు, ఇతర సౌకర్యాలను ఎమ్మెల్యే, నియోజకవర్గ కన్వీనర్ల పర్యవేక్షణలో సిద్ధం చేశారు. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు హైబ్రీడ్‌ విధానంలో ఎల్‌ఈడీ స్ర్కీన్లపై మహానాడు సరంభాన్ని ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు వైభోవోపేతంగా తిలకించనున్నారు. ఇదిలా ఉండగా డ్రగ్స్‌ కేసు వివాదం కారణంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ అధికారికంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఆయన మహానాడుకు దూరంగా గడపాల్సి వచ్చింది.

తొలి రోజు మహానాడు వేదికపై మంగళగిరి నుంచి జరిగే కార్యక్రమాలతో పాటు క్లసర్లలో ఉదయం పార్టీ జెండాల ఆవిష్కరణ, ఎన్టీఆర్‌ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలతో నివా ళులర్పిస్తారు. ఇటీవల మృతి చెందిన పార్టీ కార్యకర్తలు, నేతలకు సంతాపం ప్రకటిస్తారు. అనంతరం చంద్రబాబు నాయుడు ప్రసంగంతో మహానాడు ప్రారంభమవుతుంది. పార్టీ నిర్మాణం, భవిష్యత్‌ కార్యాచరణ, గత వైసీపీ పాలనలో అరాచకాలు, జిల్లాల అభివృద్ధిపై ముఖ్య నేతలు ప్రవేశపెట్టే తీర్మానాలపై చర్చ సాగుతుంది. వివిధ క్లస్టర్ల నుంచి ముఖ్య నేతలు కూడా చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది.

ప్రధాన తీర్మానాలు ఇవే..

మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే చింతలపూడి ఎత్తిపోతల పథకం త్వరితగతిన పూర్తి చేయడం.

ఏలూరు జిల్లాలో కోకో హబ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకొని రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం.

స్థానికంగా ఉపాధి అవకాశాలకు ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పడం.

అర్హులకు వితంతు, వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలి.

ఏలూరు నియోజకవర్గంలో ఇటీవల విలీనమైన 7 పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు.

జిల్లాలో ఘనంగా ఏర్పాట్లు

జిల్లాలో మహానాడు విజయవంతం చేసేలా ప్రణాళిక రూపొందించాం. 73 క్లస్టర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కల్యాణమండపాలు, పార్టీ కార్యాలయాలు, పబ్లిక్‌ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్ర్కీన్లపై ప్రతీ కార్యకర్త పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించేలా ఏర్పాట్లు చేశాం. మంత్రి కొలుసు పార్థసారధి, జోనల్‌ ఇన్‌చార్జి ప్రత్తిపాటి పుల్లారావు, తాను నియోజకవర్గాల్లో మహానాడు తీరును పర్యవేక్షిస్తాం. ఏలూరు నగరంలో 11 చోట్ల ప్రతి ష్టాత్మకంగా ఏర్పాట్లు చేశాం. జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు, పలుచోట్ల మహానాడులో భాగస్వామ్యం అవుతాను. జిల్లా అఽధ్యక్షుడిగా వర్చువల్‌ విధా నంలో మహానాడును ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా నిర్వహించ డానికి కృషి చేశాను. జిల్లా సర్వతోముఖాభివృద్దికి తీసుకోవాల్సిన అంశంపై ఒక తీర్మానంపై అందరితో చర్చించి ప్రవేశపెడతాం.

– బడేటి చంటి, జిల్లా అధ్యక్షుడు

Updated Date - May 27 , 2026 | 12:28 AM