జోష్
ABN , Publish Date - May 26 , 2026 | 12:13 AM
నియోజకవర్గ, జిల్లా మినీ మహానాడుల రద్దు చేసినా, ఆ జోష్ ఎక్కడా తగ్గకుండా ప్రత్యేక ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు.
వర్చువల్‌గా టీడీపీ మహానాడు
నియోజకవర్గాల్లో ఎల్‌ఈడీ స్ర్కీన్లు
73 క్లస్టర్ల కింద నేతలు, కేడర్ భాగస్వామ్యం
నిరంతరం మంత్రి, జిల్లా అఽధ్యక్షుడు, జోనల్ ఇన్‌చార్జిల పర్యవేక్షణ
27,28 తేదీల్లో రాష్ట్ర మహానాడుకుజిల్లాలో ఏర్పాట్లు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
తెలుగుదేశం మహానాడు అంటే తెలుగు తమ్ముళ్లు రెట్టిం చిన ఉత్సాహంతో లక్షల్లో కదం తొక్కుతారు. ఈసారి పశ్చి మాసియా సంక్షోంభం నేపథ్యంలో పొదుపు మంత్రంను అటు దేశంలోను, ఇటు రాష్ట్రంలో పాటిస్తున్నారు. దీంతో 27,28,29 తేదీల్లో నెల్లూరులో జరగాల్సిన రాష్ట్ర మహా నాడును వర్చువల్ విధానంలో జరపాలని అధిష్ఠానం నిర్ణ యించింది. నియోజకవర్గ, జిల్లా మినీ మహానాడుల రద్దు చేసినా, ఆ జోష్ ఎక్కడా తగ్గకుండా ప్రత్యేక ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. ఇదే సందర్భంలో జిల్లాల్లోనూ ప్రత్య క్షంగా వీక్షించేందుకు పార్టీ క్లస్టర్లు వారీగా 25 వేల మందికి తగ్గకుండా పార్టీ నిర్ణ యాలు, తీర్మానాలు, ముఖ్య చర్చలు తిలకించేందుకు వీలుగా 73 చోట్ల ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు, కేడర్ వరకు అందర్ని భాగ స్వామ్యం చేస్తూ పసుపు పండుగలో మమేకం అయ్యేలా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 73 క్లస్టర్ల పరిధిలో ఏడు నియోజక వర్గాల్లోనూ ఈనెల 27, 28 తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు తిలకించేలా ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అధిష్ఠానం లింక్ పంపుతుంది. దాన్ని ఎల్‌ఈడీ స్ర్కీన్‌పై ప్రదర్శించి.. అందరూ తిలకించేలా ఏర్పా ట్లు చేస్తున్నారు. వేదిక సమీపంలోనే విందు భోజనాలు, అల్పాహారాలు, స్నాక్స్ ఏర్పాట్ల బాధ్యతలను ముఖ్య నేత లకు అప్పగించారు. ఏలూరులో 11 చోట్ల ఎమ్మెల్యే, టీడీపీ అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణయ్య(చంటి) ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల పాటు మహానాడు వేదికలకు హాజరయ్యే పార్టీ శ్రేణులకు ఎక్కడా లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సైతం మహానాడుకు ఏర్పాట్లను చేయిస్తున్నారు.
నేడు జెండాలు, పోస్టర్ల పంపిణీ
రాష్ట్ర మహానాడుతో పార్టీ కేడర్‌లోనూ, నేతల్లోనూ ఎక్కడ జోష్ తగ్గకుండా ఉండేలా పార్టీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోంది. ప్రత్యేకంగా రాష్ట్ర అధి ష్ఠానం పసుపు జెండాలు, టోపీలు, ఇతరత్రా పోస్టర్లు ముద్రించింది. వాటిని ఈనెల 26వ తేదీ ఉదయం లోగా పంపిణీ చేసేందుకు కసరత్తులు పూర్తి చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే మహానాడులో తొలిరోజు సంతాప తీర్మానాలు, ఇతర ముఖ్య విషయాలను చర్చి స్తారు. 28న రాబోయే కాలంలో చేపట్టే అభివృద్ధి అంశా లపై దాదాపుగా 20 తీర్మానాలపై చర్చ ఉంటుంది. ఇందు లో ఏదో క్లస్టర్ నుంచి జిల్లాకు చెందిన నేతలతో చంద్రబాబు వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోనున్నారు.
ప్రత్యేక బాధ్యతల అప్పగింత
వర్చువల్ మహానాడు పర్యవేక్షణ బాధ్యతలను కొంత మందికి అప్పగించారు. జిల్లాకు చెందిన మంత్రి కొలుసు పార్థసారథి చింతలపూడి, పోలవరం నియోజక వర్గాల్లోను, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి చంటి కైకలూరులో, టీడీపీ జోనల్ ఇన్‌చార్జి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు దెందులూరు, ఉంగుటూరులను పర్యవేక్షించనున్నారు.