Share News

‘మాజీ మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలి’

ABN , Publish Date - Mar 08 , 2026 | 12:50 AM

మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్‌కే రోజా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, దైవ దర్శనాలకు వస్తే భగవంతుని దర్శించుకోవాలే తప్ప రాజకీయాలు చేయడకూడని రాష్ట్ర ముస్లిం మైనార్టీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఎం.డి. షబీనా బేగం, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మెరగని నా రాయణమ్మ హెచ్చరించారు.

‘మాజీ మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలి’
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ మహిళా నాయకులు

(భీమవరంటౌన్‌ ),మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్‌కే రోజా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, దైవ దర్శనాలకు వస్తే భగవంతుని దర్శించుకోవాలే తప్ప రాజకీయాలు చేయడకూడని రాష్ట్ర ముస్లిం మైనార్టీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఎం.డి. షబీనా బేగం, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మెరగని నా రాయణమ్మ హెచ్చరించారు. భీమవరం పట్టణ టీడీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు మద్దుల రాము అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. భీమవరం సోమేశ్వరస్వామిని మాజీ మంత్రి రోజా శుక్రవారం దర్శించుకుని టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడుపై అసభ్యకరంగా మాట్లాడడం సరికాదని విమర్శించారు. తెలుగు యువత జిల్లా మహిళ అధ్యక్షురాలు ఎం.కనక దుర్గ, దాసాంజనేయ స్వామి ధర్మకర్తలు గంధం రాధ, సాగి విజయలక్ష్మి, గొంతెన వెంకటరమణ మాట్లాడుతూ తక్షణమే రోజా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షు డు మద్దుల రాము మాట్లాడుతూ దైవదర్శ నానికి వచ్చి దేవుడు గురించి మాట్లాడడం నీచ రాజకీయమని విమర్శించారు. టీడీపీ పట్టణ కార్యదర్శి చెల్లబోయిన గోవింద్‌, ఉపాధ్యక్షురాలు సయ్యద్‌ నసీమా బేగం, పట్టణ మహిళా అధ్యక్షురాలు అంబళ్ల జోగేశ్వరి, వెంకటలక్ష్మి, ఎల్‌.లక్ష్మి, రజియా, శ్రీలక్ష్మి, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2026 | 12:50 AM