ఆక్వాకు విద్యుత్ సబ్సిడీ అమలు అభినందనీయం
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:27 AM
రాష్ట్ర మ్రంతి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో భాగంగా భీమవరం పట్టణంలో 2023 సెప్టెంబరుఓ నిర్వహించిన బహిరంగ సభలో ఆక్వా, నాన్ ఆక్వా రంగాలకు కరెంట్ యూనిట్ ధర రూ.1.50లకు సబ్సిడీ అమలు చేస్తామన్న మాటను నిలబెట్టుకోవడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ధన్యవా దాలు తెలిపారు.
భీమవరంటౌన్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర మ్రంతి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో భాగంగా భీమవరం పట్టణంలో 2023 సెప్టెంబరుఓ నిర్వహించిన బహిరంగ సభలో ఆక్వా, నాన్ ఆక్వా రంగాలకు కరెంట్ యూనిట్ ధర రూ.1.50లకు సబ్సిడీ అమలు చేస్తామన్న మాటను నిలబెట్టుకోవడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ధన్యవా దాలు తెలిపారు. గురువారం భీమవరం పట్టణం ప్రకాశంచౌక్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులతో కలిసి ఆమె మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా రైతులు అధిక నష్టాలను ఎదుర్కొన్నందున కరెంట్ సబ్సిడీ ఇవ్వాలనే విజ్ఞప్తి మేరకు మంత్రి లోకేశ్ కరెంట్ సబ్సిడీ అమలు చేశారన్నారు. పార్టీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమంలో ఏపీ కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, మెరగాని నారాయణమ్మ, వెండ్ర శ్రీనివాస్, ఉప్పులూరి చంద్రశేఖర్, ఎండీ షబీనా, చెరుకుపల్లి సంతోష్‌కుమార్, కొల్లిపర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.