వైసీపీ శవ రాజకీయాలు
ABN , Publish Date - Jun 22 , 2026 | 12:29 AM
రాష్ట్రంలో ఎటువంటి ఘటన జరిగినా దానికి కులం అంటగట్టడం, శవ రాజకీయాలు చేయడం వైసీపీ విష సంస్కృతిలో భాగమైందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి మండి పడ్డారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి
ఏలూరు టూటౌన్, జూన్ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎటువంటి ఘటన జరిగినా దానికి కులం అంటగట్టడం, శవ రాజకీయాలు చేయడం వైసీపీ విష సంస్కృతిలో భాగమైందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి మండి పడ్డారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాయయంలో ఆర్‌టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై విషాన్ని వెదజల్లడం వైసీపీ నాయకులకు పరిపాటి అయిందన్నారు. విజయవాడకు చెందిన కాపు కులస్థుడు సాయికృష్ణను హతమార్చితే ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ స్పందించరా అంటూ మాటా ్లడడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. పోలీసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి విమర్శలు అర్ధరహితం అన్నారు. చనిపోయిన వారి కులా ల పేర్లతో కూడా పబ్బం గడుపుకునేందుకు వైసీపీ వెనుకాడడం లేదన్నారు. వైసీపీ 11 సీట్లకు పరిమితమైన సిగ్గురాలేదని ఎద్దేవా చేశారు. ఆర్‌టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ సాయికృష్ణ అదృశ్యం కేసులో తొలిసారిగా స్పందించింది ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అతని తల్లితో మాట్లాడి సీఐ నాగరాజును సస్పెండ్ చేయడమే కాకుండా పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు ఇచ్చారని అన్నారు. వైసీపీ నాయకులు మాత్రం కుయు క్తులు ఆపడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయికృష్ణ మేనమామ ఇచ్చిన సమాచారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. జగన్ రెడ్డి, అతని పరివారం శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఈడా చైర్మన్ శివప్రసాద్, టీడీపీ నేతలు చోడే వెంకటరత్నం, రెడ్డి నాగరాజు పాల్గొన్నారు.