Share News

మందకొడిగా..

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:54 AM

జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి ప్రధాన ఆదా య వనరైన ఆస్తి పన్ను వసూళ్లు మందకొడిగా సాగుతున్నాయి. 2025 ఏప్రిల్‌ నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు దాదాపు పదకొండు నెలల్లో కేవలం 43.97 శాతం మాత్రమే ఆస్తి పన్ను వసూలైంది. మంచినీటి పన్ను 40 శాతం మాత్రమే వసూలైంది. మార్చి 31 నాటికి నూరు శాతం పన్నులు వసూళ్లపైౖ మున్సిపల్‌ అధికారు లు ప్రధాన దృష్టి పెట్టకపోతే పట్టణ అభివృద్ధి కుంటుపడే అవకాశాలున్నాయి.

మందకొడిగా..

జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో పేరుకుపోయిన బకాయిలు

ఆస్తిపన్ను రూ.7.41 కోట్లు, కుళాయిల పన్ను రూ.2.26 కోట్లు

రూ.కోటి వరకు ప్రభుత్వ భవనాల ఆస్తిపన్ను బకాయిలు

జంగారెడ్డిగూడెం, మార్చి1 (ఆంధ్రజ్యోతి) : జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి ప్రధాన ఆదా య వనరైన ఆస్తి పన్ను వసూళ్లు మందకొడిగా సాగుతున్నాయి. 2025 ఏప్రిల్‌ నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు దాదాపు పదకొండు నెలల్లో కేవలం 43.97 శాతం మాత్రమే ఆస్తి పన్ను వసూలైంది. మంచినీటి పన్ను 40 శాతం మాత్రమే వసూలైంది. మార్చి 31 నాటికి నూరు శాతం పన్నులు వసూళ్లపైౖ మున్సిపల్‌ అధికారు లు ప్రధాన దృష్టి పెట్టకపోతే పట్టణ అభివృద్ధి కుంటుపడే అవకాశాలున్నాయి.

రాయితీ కోసం ఎదురుచూపు

ఏటా మార్చిలో ఆస్తి పన్నుపై 50 శాతం వడ్డీ రాయితీ ఇచ్చేవారు. గత సంవత్సరం వడ్డీ రాయితీ సమయం అతి తక్కువ రోజులు ఇవ్వడంతో ప్రజలు పూర్తిస్థాయిలో ఉపయోగిం చుకోలేక పోయారు. ఈ సంవత్సరమైనా ఎక్కు వ రోజలు సమయం ఇవ్వడంతో పాటు త్వరగా రాయితీ ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు.

రూ.5.81 కోట్లు ఆస్తి పన్ను వసూళ్లు

పట్టణంలో 2026 ఫిబ్రవరి 28 నాటికి 19, 636 హౌస్‌ అసెస్మెంట్లు ఉండగా వీటి నుంచి రూ.8.38 కోట్లు ఇంటి పన్నులు వసూలు కావా ల్సి ఉంది. పాత బకాయిలు రూ.4.84 కోట్లతో కలిపి మొత్తం రూ.13.22 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ సంవత్సరానికి చెందిన ఆస్తిపన్ను రూ.4.94 కోట్లు వసూలు కాగా గతేడాది ఆస్తి పన్ను బకాయిలు రూ.88 లక్షలు కలిసి మొత్తం రూ.5.81 కోట్లు వసూలు చేశారు.కాగా ఇంకా పాత బకాయి రూ.3.96 కోట్లు రావాల్సి ఉండ గా, కొత్త బకాయిలు రూ.4.71 కోట్లతో కలిపి రూ.7.41 కోట్లు బకాయి ఉంది.

మంచినీటి పన్ను వసూళ్లు రూ.58 లక్షలు

పట్టణంలో 8,64 మంచినీటి కుళాయి కనె క్షన్లు ఉండగా పాత బకాయి రూ.1.65 కోట్లు మొత్తం వాటి నుంచి రూ.2.81 కోట్లు పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.54.20 లక్షలు వసూలు చేయగా ఇంకా రూ.2.26 కోట్లు బకాయిలున్నాయి.

ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు రూ.కోటి

మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు చెందిన ఆస్తిపన్ను ఏళ్ల తరబడి బకాయిలు రూ.లక్షల్లో ఉన్నాయి. హెడ్‌ పోస్టాఫీసు రూ.6.36 లక్షలు, పట్టణంలోని రెండు పొగాకు వేలం కేంద్రాలు, కార్యాలయ భవనాలపై రూ.3.04 లక్షలు, ఫారె స్ట్‌ కార్యాలయ భవనాలు రూ.8.05 లక్షలు, పోలీస్‌స్టేషన్‌ భవనానికి రూ.2.96 లక్షలు, సర్కి ల్‌ కార్యాలయం రూ.98 వేలు, పోలీస్‌ క్వార్టర్స్‌ రూ.2.11 లక్షలు, ట్రాఫిక్‌ స్టేషన్‌ రూ.35 వేలు, ఎక్సైజ్‌ స్టేషన్‌ రూ.1.12 లక్షలు, పంచా యతీరాజ్‌ కార్యాలయం రూ.పదిలక్షలు, శాఖా గ్రంథాలయం రూ.2.70 లక్షలు, ఆర్‌అండ్‌బీ రూ.3.41 లక్షలు, ఎస్‌డీఎస్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల రూ.23.24 లక్షలు, ఆర్‌డబ్ల్యూఎస్‌ రూ.96 వేలు, ఎంపీడీవో కార్యాలయం రూ.50 వేలు, ఎంఈవో కార్యాలయం రూ.2.09 లక్షలు ఇలా అనేక ప్రభుత్వ కార్యాలయాల నుంచి సుమారు రూ.కోటి బకాయిలు రావాల్సి ఉంది.

నూరుశాతం వసూలు చేస్తాం..

‘ఇంటి, కుళాయి పన్నులను 2026 మార్చి 31 లోపు నూరుశాతం వసూలు చేసే విధంగా పని చేస్తున్నాం. జనవరి నుంచి ప్రత్యేక వాహ నాన్ని ఏర్పాటు చేసి మార్చి నెలాఖరు వరకు ప్రచారం చేస్తున్నాం. దీర్ఘకాలిక ప్రభుత్వ, ప్రైవే టు మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి పెడతా’మని మున్సిపల్‌ కమిషనర్‌ కేవీ రమణ, ఆర్‌ఐ ఎన్‌.సుబ్బారావు పేర్కొన్నారు.

Updated Date - Mar 02 , 2026 | 12:58 AM