Share News

2,342 గ్రూపులు.. రూ.381.30 కోట్లు

ABN , Publish Date - Jul 13 , 2026 | 12:36 AM

జిల్లాలోని మహిళా సంఘాల్లోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు వారికి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పనకు మెప్మా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.

2,342 గ్రూపులు.. రూ.381.30 కోట్లు

అర్హత పొందిన గ్రూపులు 2,542

328 గ్రూపులకు రూ.56.60 కోట్లు అందజేత

భీమవరం టౌన్‌, జూలై 12(ఆంధ్రజ్యోతి) :జిల్లాలోని మహిళా సంఘాల్లోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు వారికి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పనకు మెప్మా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా కొత్తగా సూక్ష్మ రుణ ప్రణాళిక (మైక్రో క్రెడిట్‌ ప్లాన్‌–ఎంసీపీ) ద్వారా రుణాలు మంజూరు చేయిస్తూరు. సంఘ సభ్యులకు రుణం ఎప్పుడు అవసరం ?ఎంత అవసరం ? దేని నిమిత్తం ?అనేది సభ్యులతో చర్చించి వారి వ్యాపార, కుటుంబ అవసరాలకు అనుగుణంగా బ్యాంకుల ద్వారా రుణాలు అందించేలా చర్యలు చేపడుతున్నారు. గతంలో గ్రూపులకు రూ.10 లక్షల వరకు ఇచ్చేవారు. ఇప్పుడు గ్రూపు అర్హతలను బట్టి రూ.20 లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు. సభ్యురాలి వ్యాపార అవసరాలను బట్టి రూ లక్ష నుంచి వారి వ్యాపారాన్ని బట్టి 5 లక్షల వరకు రుణం అందించేలా ఈ ప్రణాళిక రూపొందించారు. జిల్లాలోని అన్ని మునిసిపాల్టీలోని గ్రూపులకు ఎంసీపీ చేయిస్తారు. ఐతే ప్రభుత్వం నిర్ధేశించిన గ్రూపుల్లో అర్హత ఉన్నవారికి మాత్రమే రుణం మంజూరవుతుంది. గతంలో పేపరుపైన తీర్మానం రాసి రుణం పొందేవారు. సభ్యురాలు ఉన్నా లేకపోయినా రుణం ఇచ్చేవారు. ఇప్పుడు ఐతే సభ్యురాలు ఓటీపీని నమోదు చేసిన వారికి వచ్చే రుణం ఎంతో తెలిపి ఎంసీపీలో నమోదు చేస్తారు. దీనివల్ల ఆర్థిక అవకతవకలు జరగుకుండా వీలు ఏర్పాడుతోంది.

రూ.56.60 కోట్లు అందజేత

ప్రస్తుతం జిల్లాలోని 6 మునిసిపాల్టీల్లో కలిపి 328 గ్రూపులకు రూ.56.60 కోట్లు ఎంసీపీ ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించారు. వాస్తవంగా జిల్లాకు 2,542 గ్రూపులకు రూ.381.30 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐతే జూన్‌ నెలాఖరునాటికి 328 గ్రూపులకు రూ.56.60 కోట్లు మంజూరు చేయించారు. మిగిలిన గ్రూపులకు సంబంధించి ఆన్‌లైన్‌ పక్రియ జరుగుతోంది. అర్హత సాధించిన గ్రూపులకు రుణాలు అందించనున్నారు.

బ్యాంకర్లకు మైక్రో క్రెడిట్‌పై అవగాహన

కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ ఎంసీపీపై జిల్లాలోని బ్యాంకర్లకు లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ నాగేంద్ర ప్రసాద్‌ పర్యవేక్షణలో మెప్మా జిల్లా అధికారిణి హెబ్సీబా అవగాహన కల్పించారు. బ్యాంకర్లకు నిర్ధేశించిన లక్ష్యాలను త్వరతిగతిన పూర్తిచెయ్యాలని కోరారు. జిల్లాలోని మునిసిపాల్టీల వారీగా ఆన్‌లైన్‌ ఎంసీపీ సర్వే చేసిన వివరాలు ఇలా ఉన్నాయి.

మునిసిపాల్టీ గ్రూపులు ఆన్‌లైన్‌ రుణార్హత ఇచ్చినవి

అయినవి పొందినవి

భీమవరం 2250 1683 710 73

నరసాపురం 835 699 244 26

పాలకొలు 628 1465 472 56

తాడేపల్లిగూడెం 1812 1755 575 91

తణుకు 1456 1339 393 69

ఆకివీడు 644 488 148 13

8,625 7,429 2,542 328

Updated Date - Jul 13 , 2026 | 12:36 AM