Share News

సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా తణుకు

ABN , Publish Date - Jan 01 , 2026 | 12:09 AM

తణుకును గ్రేడ్‌–1 నుంచి సెలక్షన్‌ గ్రేడ్‌ మునిసిపాలిటీగా అప్‌ గ్రేడ్‌ చేస్తూ మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేష్‌కుమార్‌ బుధవారం ఉత్త ర్వులు జారీచేశారు.

సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా తణుకు

తణుకు, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): తణుకును గ్రేడ్‌–1 నుంచి సెలక్షన్‌ గ్రేడ్‌ మునిసిపాలిటీగా అప్‌ గ్రేడ్‌ చేస్తూ మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేష్‌కుమార్‌ బుధవారం ఉత్త ర్వులు జారీచేశారు. ఇప్పటి వరకు జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం మాత్రమే సెలక్షన్‌ గ్రేడ్‌ మునిసిపాలిటీలు కాగా.. ఇప్పుడు తణుకు మూడోది. పన్నుల చెల్లింపు, ఆదా యం వృద్ధిలో ఈ పట్టణం ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా సెలక్షన్‌ గ్రేడ్‌ రావడంతో మునిసిపాలిటీకి అదనం గా సిబ్బంది పెరగడంతోపాటు కేంద్ర ప్రభుత్వ నిధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా రోడ్లు, డ్రెయి న్లు, తాగునీరు, విద్యుత్‌ దీపాలు మరింత మెరుగుపడ తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఫలితం గా పట్టణం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది.

Updated Date - Jan 01 , 2026 | 12:09 AM