Share News

వైసీపీ పాలనలో క్రీడలకు గ్రహణం

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:29 AM

జగన్‌ పాలనలో క్రీడలకు గ్రహణం పట్టించారని ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌ రవినాయుడు విమర్శించారు. మంగళవారం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో కలసి మున్సిపల్‌ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

వైసీపీ పాలనలో క్రీడలకు గ్రహణం
ఇండోర్‌ స్టేడియంలో షటిల్‌ ఆడుతున్న ఆరిమిల్లి, రవినాయడు

తణుకును బ్యాడ్మింటన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే ఆరిమిల్లి

తణుకు, మార్చి 10(ఆంధ్రజ్యోతి):జగన్‌ పాలనలో క్రీడలకు గ్రహణం పట్టించారని ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌ రవినాయుడు విమర్శించారు. మంగళవారం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో కలసి మున్సిపల్‌ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. గతంలో క్రీడాకారులు ఉద్యోగానికి అర్హత పొందాలంటే పరీక్ష రాయాల్సి ఉండేదని, ప్రస్తుతం రాష్ట్రంలో రద్దు చేశామన్నారు. డీఎస్సీలో 421 మంది క్రీడాకారులు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు ఎక్కడిక్కడే నిలిపి వేయ డంతో ప్రస్తుతం వాటి అంచనాలు రెట్టింపయ్యాయని తెలిపారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని క్రీడల హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఇండోర్‌ స్టేడి యంలో బాక్సు క్రికెట్‌ ప్రాంగణాన్ని ప్రారంభించారు. బాలురున్నత పాఠ శాల ఆవరణలో నిర్మాణంలో వున్న ఇండోర్‌ స్టేడియం, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆవరణలో ఉన్న సింథటిక్‌ వాకింగ్‌ ట్రాక్‌ పరిశీలించారు.

Updated Date - Mar 11 , 2026 | 12:31 AM