తాడేపల్లిగూడెంలో ఎన్నికల హీట్
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:55 PM
తాడేపల్లిగూడెంలో మున్సిపల్ ఎన్నికల హీట్ పెరిగింది. సుదీర్ఘ విరామం అనంతరం మలిదశ మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఆసక్తిగా మారాయి
ఎన్నికలకు సర్వం సిద్ధం
సుదీర్ఘ విరామం అనంతరం కావడంతో ఉత్కంఠ
తాడేపల్లిగూడెం, నవంబరు 13(ఆంధ్ర జ్యోతి): తాడేపల్లిగూడెంలో మున్సిపల్ ఎన్నికల హీట్ పెరిగింది. సుదీర్ఘ విరామం అనంతరం మలిదశ మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఆసక్తిగా మారాయి. అధికారులు పూర్తిగా సన్నద్ధమయ్యారు. ఎన్నికల ఏర్పాట్లు చురుగ్గా జరుగుతు న్నాయి. శుక్రవారం మున్సిపల్ కార్యాల యం ఆవరణలో డెమో కార్యక్రమాన్ని కమి షనర్ ఏసుబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి నామినేషన్ స్వీకరణ కేంద్రంలో ఎలక్షన్ ఆఫీసర్(ఈవో) ఇద్దరు అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్లను ఎన్నికల సంఘం నియమించింది. దీనికి సంబంధించిన శిక్షణ కార్యక్రమం కూడా ఉదయం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్లకు అంతా సిద్ధంగా ఉంచామని, 12 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. పోటీ అభ్యర్థులు రూ.505 మున్సిపల్ కార్యాలయంలో కడితే నో డ్యూ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారన్నారు. చైర్మన్ అభ్యర్థి మున్సిపాల్టీలో ఏ వార్డు నుంచైనా నామినేషన్ దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు. పోటీచేసే అభ్యర్థులు జనరల్ కేటగిరీకి వస్తే నామినేషన్ వేసేందుకు రూ.3000 మున్సిపల్ కార్యాలయంలో కట్టి చలానా తీసుకోవాల్సి ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థలు అయితే 50శాతం రాయితీతో రూ.1500 చెల్లించి చలానా పొందాల్సి ఉంటుందన్నారు.