Share News

కాలువల్లో వేసవి తాపానికి చెక్‌

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:44 AM

పంట బోదెలు, పంట కాలువల్లో దూకుతూ, ఈదుతూ వేసవి తాపానికి చెక్‌ పెడతున్నారు.

కాలువల్లో వేసవి తాపానికి చెక్‌

వేసవికాలం వచ్చిందంటే పెద్దలైతే ఎండలకు తట్టుకోలేక ఇంట్లోనే కాలక్షేపం చేస్తారు. చిన్నారులు, యువత మాత్రం ఎండలకు ఎదురు వెళ్లి మరీ ఆయా గ్రామాలలో ఉన్న పంట బోదెలు, పంట కాలువల్లో దూకుతూ, ఈదుతూ వేసవి తాపానికి చెక్‌ పెడతున్నారు. ఈ కొవలోనే వేండ్ర గ్రామం మీదుగా భీమవరం వైపు వెళుతున్న జీఎండ్‌వి కెనాల్‌లో వేండ్ర వంతెన వద్ద భీమవరం పరిసరాలు, పాలకోడేరు మండల గ్రామాల నుంచి ఆ ప్రాంతానికి వెళ్లి యువత సందడి చేస్తున్నారు. దీనితో ఈ ప్రాంతం పిక్నిక్‌ స్పాట్‌గా తయారైంది.

– పాలకోడేరు, ఆంధ్రజ్యోతి

Updated Date - Apr 03 , 2026 | 12:44 AM