స్వచ్ఛత..సంపద!
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:17 AM
జిల్లాలో గత ఏప్రిల్ ఒకటో తేదీన స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. జిల్లాలోని 27 మండలాల్లో 27 స్వచ్ఛ రథాల ద్వారా చెత్త సేక రణ చేపట్టారు. జిల్లాలోని 547 పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
జిల్లాలో సత్ఫలితాలిస్తున్న స్వచ్ఛ రథాల కార్యక్రమం
స్వచ్ఛ రథాల ద్వారా 4.71 లక్షల కిలోల చెత్త సేకరణ
రీసైక్లింగ్ ద్వారా రూ.65.48 లక్షల ఆదాయం సమీకరణ
(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో గత ఏప్రిల్ ఒకటో తేదీన స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. జిల్లాలోని 27 మండలాల్లో 27 స్వచ్ఛ రథాల ద్వారా చెత్త సేక రణ చేపట్టారు. జిల్లాలోని 547 పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్య క్రమంలో భాగంగా జిల్లాలో ఈనెల 4వ తేదీ వరకు 4లక్షల 71వేల 43 కిలోల వేస్ట్ మెటీ రియల్‌ను సేకరించారు. ఈ వేస్ట్ మెటీరియల్ (చెత్త)ను రీ సైక్లింగ్ చేయడం ద్వారా జిల్లాకు రూ.65 లక్షల 48 వేల 140 ఆదాయం సమ కూరింది. ఈ వేస్ట్ మెటీరియల్ సేకరణ ద్వారా గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్య నిర్వహణ జరు గుతోంది. దీంతో స్వచ్ఛభారత్ లక్ష్యాలను సాధించడానికి అవకాశం ఏర్పడింది. జిల్లాలో 27 మండలాలకు కేటాయించిన స్వచ్ఛ రథాలు ఒక్కొక్క మండలంలో 25 రోజుల పాటు ఈ వేస్ట్ మెటీరియల్‌ను సేకరిస్తారు. వచ్చిన చెత్తను విభజించి వాటిని రీసైక్లింగ్‌కు ఉప యోగపడే చెత్తను రీసైక్లింగ్ చేస్తారు. జిల్లా లోని 547 పంచాయతీల్లో ఈ చెత్త సేకరణలో భాగంగా 1,23,354 కిలోల ప్లాస్టిక్ మెటీరియల్, 1,49,988 కిలోల పేపర్ మెటీరియల్, 68,012 కిలోల మెటల్ మెటీరియల్, 1,11,077 కిలోల గ్లాస్ మెటీరియల్, 8,657 కిలోల క్లాత్ మెటీ రియల్, 2,600 కిలోల ఈ–వేస్ట్ మెటీరియల్‌తో పాటు 7,353 కిలోల ఇతర వేస్ట్ మెటీరియల్‌ను సేకరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చెత్తను బయట పారేయకుండా ఈ స్వచ్ఛ రథాలు వచ్చినప్పుడు వాటికి అందజేయాలనే అవగాహన కలిగిందని చెబుతున్నారు. తద్వారా గ్రామాలు స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దబడు తున్నాయని పేర్కొంటున్నారు.
దెందులూరు మండలంలో..
దెందులూరు:స్వచ్ఛరథం కార్యక్రమం మం డలంలో ప్రారంభంలో నత్తనడకన జరిగి లక్ష్యాల సాధనలో వెనుక బడింది. ప్రస్తుతం నెల రోజులుగా గ్రామాల్లో ప్లాస్టిక్, ఇతర పొడి వ్యర్థాలను నిరోధించేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకుని వచ్చిన ఈ పథకం సత్ఫలితాలనిస్తోంది. చెత్తతో సంపద నినాదంతో గ్రామీణ ప్రాంతాల్లో చెత్తను నివారించడం, వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడం, గ్రామస్థుల నుంచి గ్రామాల్లోని ఇళ్ల వద్దే గాజు, పుస్తకాలు, ప్లాస్టిక్, కాగితం,అట్టలు, ఇనుము, ప్లాస్టిక్, పాత పైపులు, పొడి చెత్త మొత్తం పది రకాల వస్తువులను సేకరించి, వాటికి బదులుగా వంట నూనె, సర్ఫ్, సబ్బులు, కొబ్బరి నూనె వంటి వాటిని మార్పిడి పద్ధతుల్లో ఇవ్వడం, నగదు కావాలంటే నగదు అందించేలా ఎంపీడీవో, పంచాయతీ అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో జరుగుతుండటంతో గతంతో పోలిస్తే ఈ స్వచ్ఛరథంపై గ్రామస్థుల కు అవగాహన పెరిగింది. స్వచ్ఛరథం నిర్వాహకుడికి నెలకు రూ.25 వేల చొప్పున పారితోషకంను ఎంపీడీవో ఆధ్వర్యంలో ప్రజా పరిషత్ నుంచి వేతనం అందిస్తున్నారు. మండలంలోని 20 సచివాలయాలకు స్వచ్ఛరథం షెడ్యూల్‌ను రూపొందించారు.
కొయ్యలగూడెం మండలంలో..
కొయ్యలగూడెం: మండలంలో స్వచ్ఛరథం కార్యక్రమం విజయవంతమవుతోంది. ఇళ్ల వద్ద నిరుపయోగంగా ఉన్న వస్తువులను స్వచ్ఛరథం వద్దకు తెచ్చి వివిధ సరుకులను మార్పిడి చేసు కుంటున్నారు. స్వచ్ఛరథం వచ్చే సమాచారాన్ని రెండు రోజుల ముందే సంబంధిత పంచా యతీలో ప్రచారం చేయాలి. ప్లాస్టిక్ తదితర వస్తువులను స్వచ్ఛరథం నిర్వాహకులకు ఇస్తే వాటి విలువను బట్టి వారివద్ద ఉన్న వివిధ రకాల సరుకులను అందిస్తున్నారు. ఈ విధానం ఎంతో బాగుందని గ్రామస్థులు తెలుపుతున్నారు.
జంగారెడ్డిగూడెం మండలంలో..
జంగారెడ్డిగూడెం రూరల్: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం పంచాయ తీలకు అందించిన స్వచ్ఛరథాల నిర్వహణలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. వాహనం నిర్వహణ, డీజిల్ వ్యయం తదితర కారణాలతో ఇంటింటి చెత్త సేకరణ అనుకున్న స్థాయిలో జరగడం లేదని మండలవాసులు చెబుతున్నారు. పలు పంచాయతీలకు స్వచ్ఛరథం సక్రమంగా రావడం లేదని చెబుతున్నారు. మరోవైపు ప్లాస్టిక్ నియంత్రణపై ప్రజల్లో కొంతవరకు అవగాహన కలుగుతోంది. మండలంలో ప్రతి రోజు 1400 కేజీలు పొడి చెత్త వస్తోంది. కేజీ ఐరన్ రూ.20, స్టీల్ రూ.40, వాటర్ బాటిళ్లు రూ.4, ప్లాస్టిక్ బాటిళ్లు రూ.20. బుక్స్, పేపర్లు రూ.10, అట్టపెట్టెలు రూ.15లకు సేకరించి దానికి సరిసమామైన సరుకులు అందిస్తున్నారు.
ముదినేపల్లి మండలంలో..
ముదినేపల్లి: మండలంలో స్వచ్ఛరథం పఽథకం నిర్వహణ విజయవంతంగా జరుగుతోంది. మండలంలోని 32 పంచాయతీల్లో ఈ కార్యక్రమం అమలు జరుగుతోంది. షెడ్యూల్ మేరకు స్వచ్ఛరథం ఆయా గ్రామాలకు వెళ్లి ప్లాస్టిక్ ఇతర వ్యర్థ పదార్థాలను ప్రజల నుంచి తీసుకుని వాటి విలువకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు.