స్వచ్ఛాంధ్ర మిథ్యే..!
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:51 PM
పురపాలక సంఘాల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లక్ష్యం నెరవేరడం లేదు. మునిసి పల్ కమిషనర్లు పారిశుధ్యం పనుల పర్యవేక్షణ చేయడం లేదు. ఏలూరు కార్పొరేషన్‌లో ఏ వీధి చూసిన చెత్త, మట్టి దిబ్బల గుట్టలు రోజుల తరబడి పేరుకుపోతున్నా యి.
ఏలూరు కార్పొరేషన్, మూడు మునిసిపాలిటీల్లో కానరాని అవార్డు ప్రయత్నాలు
కమిషనర్ల పర్యవేక్షణ శూన్యం..
మెరుగుపడని పారిశుధ్యం
సీఎం చంద్రబాబు ఆదేశించినా కదలని అధికారులు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
‘ఏ పట్టణంలో చూసిన పారిశుధ్యం మెరుగు పడడం లేదు. స్వచ్చాంధ్ర–స్వర్ణాంధ్ర మొదలు పెట్టినా పారిశుధ్యంపై కమిషనర్లు పర్యవేక్షణ చేయడం లేదు. కేంద్రం ఇచ్చే స్వచ్ఛత అవార్డులకు పురపాలక సంఘాలు పోటీ పడడం మానేశాయి. కనీసం కలెక్టర్లు అయినా పట్టించుకోవాలి కదా’ అంటూ సీఎం చంద్రబాబు ఇటీవల కలెక్టర్ల సదస్సులో వ్యాఖ్యానించారు. నెలలో ఎనిమిది రోజులు వివిధ ప్రాంతాల్లో పర్యటించాలని దిశా నిర్దేశం చేశారు. అయినా జిల్లా యంత్రాంగంలో మార్పు కనిపించడం లేదు.
పురపాలక సంఘాల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లక్ష్యం నెరవేరడం లేదు. మునిసి పల్ కమిషనర్లు పారిశుధ్యం పనుల పర్యవేక్షణ చేయడం లేదు. ఏలూరు కార్పొరేషన్‌లో ఏ వీధి చూసిన చెత్త, మట్టి దిబ్బల గుట్టలు రోజుల తరబడి పేరుకుపోతున్నా యి. నూజివీడు, చింతల పూడి, జంగారెడ్డిగూడెంల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. కేంద్రం ఏటా స్వచ్ఛత అవార్డులను ప్రకటిస్తోంది. పారి శుధ్యం మెరుగు దలతో ప్లాస్టిక్ నివా రణ, డ్రెయిన్లు పరి శుభ్ర త, ఖాళీ స్థలాల్లో పరి శుభ్రత, డంపింగ్ యార్డులు, చెత్త శుద్ధి, రోడ్లు తదితర అంశాలపై అధ్యయనం చేసి.. ఆయా పురపాలక సంఘాలకు మార్కులు వేసి అవార్డులను ప్రకటిస్తుంది. జిల్లాలో కనీసం ఒక్క పురపాలక సంఘం కూడా అవార్డులకు పోటీపడే స్థాయిలో లేవు.
చెత్త విభజన తూచ్
ఏలూరుతో పాటు మిగిలిన మునిసిపాలి టీల్లో తడి,పొడి చెత్తల సేకరణ అనం తరం విభజన తూతూ మంత్రంగానే సాగుతోంది. బారెడు పొద్దుపోయే వరకు వీధుల్లో చెత్తసేకరణ పూర్తి కావడం లేదు. ఒకప్పుడు తెల్ల వారు జామునే మస్తర్లు వేసుకుని వీధుల్లో ఉండేవారు.. ఇప్పుడు ఏడెనిమిది అవుతున్నా ఉదయం పారి శుధ్య పనుల్లో నిమగ్నం కావడం లేదన్న విమర్శలున్నాయి. అన్నిచోట్ల రెగ్యులర్ సిబ్బంది స్థానంలో పదుల సంఖ్యలో బినామీ ఉద్యోగులు పారిశుధ్య పనులను చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
టన్నుల కొద్దీ చెత్త నిల్వలే..
ఏలూరులో రోజుకు 120 టన్నులకు పైగా చెత్త ఉత్పత్తి అవుతుంది. నూజివీడు 32 వార్డుల్లో రోజూ 60 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. జంగారెడ్డిగూడెంలో 40 టన్నులు, చింతలపూడిలో 15 టన్నుల పైబడి చెత్త ఉత్పత్తి అవుతోంది. అయితే చెత్త సేకరణ పూర్తిస్థాయిల్లో జరగడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
ఇప్పటికైనా పట్టించుకుంటారా?
సీఎం ఆదేశాలను ఇప్పటికైనా కమిషనర్లు, జిల్లా యంత్రాంగం పట్టించుకుంటుందా? అన్న ఆసక్తి నెలకొంది. మార్చి నెలాఖరు తర్వాత కేంద్ర బృందాలు పురపాలక సంఘాల్లో పర్య టించి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి.. నివేదికలు ఇస్తాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్, కమిషనర్లు ‘స్వచ్చాంధ్ర–స్వర్ణాంధ్ర’పై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.