ప్లాస్టిక్ వ్యర్థాలివ్వండి.. సరుకులు తీసుకెళ్లండి
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:32 AM
స్వచ్ఛ రథాన్ని భీమవరం మండలం తాడేరులో ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, జేసీ రాహుల్‌కుమార్ శనివారం ప్రారంభించారు.
తాడేరులో స్వచ్ఛ రథం ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు
భీమవరం రూరల్, జనవరి 24(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, వాటికి ప్రతిగా నిత్యావసర సరుకులను అందించే స్వచ్ఛ రథాన్ని భీమవరం మండలం తాడేరులో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు), జేసీ రాహుల్‌కుమార్ శనివారం ప్రారంభించారు. ప్రజల నుంచి పాత ప్లాస్టిక్ డబ్బాలు, మిల్క్ ప్యాకెట్లు, పాలిథిన్ కవర్లు, ఐరన్, స్టీల్ వంటి 29 రకాల వస్తువులను సేకరించి అందుకు ప్రతిగా కొబ్బరినూనె, సర్ఫ్, నూనె, గోధుమపిండి, మినపప్పు, కంపర్ట్ వంటి 12 రకాల సరుకులను అందజేస్తామని ఎమ్మెల్యే చెప్పారు.