సబ్ ట్రెజరీ అధికారులు ముగ్గురు సస్పెన్షన్
ABN , Publish Date - Oct 03 , 2026 | 01:00 AM
జంగారెడ్డిగూడెం సబ్ ట్రెజరీ కార్యా లయ ఉద్యోగులు ఏటీవో కె.చంద్రయ్య, ఎస్‌టీవో ఎస్.చినబాబు, సీనియర్ అకౌం టెంట్ రాజేశ్‌లపై శాఖాపరమైన చర్యలతో పాటు వారిని సస్పెండ్ చేస్తూ ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ డైరెక్టర్ పద్మజ ఉత్త ర్వులు జారీ చేశారు.
జంగారెడ్డిగూడెం, అక్టోబరు 2 (ఆంధ్ర జ్యోతి):జంగారెడ్డిగూడెం సబ్ ట్రెజరీ కార్యా లయ ఉద్యోగులు ఏటీవో కె.చంద్రయ్య, ఎస్‌టీవో ఎస్.చినబాబు, సీనియర్ అకౌం టెంట్ రాజేశ్‌లపై శాఖాపరమైన చర్యలతో పాటు వారిని సస్పెండ్ చేస్తూ ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ డైరెక్టర్ పద్మజ ఉత్త ర్వులు జారీ చేశారు. మొడియం రత్న కుమారి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో గత నెల 24న ఏసీబీ డీఎస్పీ జీవీ.కృష్ణారావు ఆధ్వర్యంలో సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఆకస్మిక దాడు లు నిర్వహించి పలు వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే వీరిని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఏలూరు ఏటీవో వెంకటేశ్వరమ్మకు సబ్ ట్రెజరీ బాధ్యతలు అప్పగించారు.